Thursday, January 23, 2025

బార్బడోస్ లో చిక్కుకున్న టీమ్ ఇండియా

- Advertisement -
- Advertisement -

బెరిల్ హరికేన్ కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూసేశారు. దాంతో భారత క్రికెట్ జట్టు హోటల్ కే పరిమితమయ్యారు. అయితే హోటల్ లో సేవలు కూడా ప్రభావితం అయ్యాయి. ‘తీవ్ర ప్రమాదకర కేటగిరి 4’ తుఫాను మరింత తీవ్రంగా మారింది. క్రికెటర్లు, వారి కుటుంబం, సహాయక సిబ్బంది, బిసిసిఐ అధికారులు- అంతా చిక్కుకుపోయారు.

హరికేన్ హెచ్చరికలు జారీచేశారు. నివాసులు, పర్యాటకులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. బార్బడోస్ ప్రాంతంలో 130 ఎంపిహెచ్ వేగంతో తీవ్ర గాలులు వీస్తున్నాయి.

అట్లాంటిక్ సీజన్ 2024 లో బెరిల్ తొలి హరికేన్. అది ప్రమాదస్థాయి కేటగిరి 4గా తీవ్రతరం అయింది. ఈ హరికేన్ గాలులు ఆదివారం రాత్రి లేక సోమవారం తెల్లవారు జామున  విండ్ వార్డ్స్ ఐలాండ్స్ కు చేరుకుంటాయని సమాచారం.

Indian team stranded

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News