Wednesday, January 22, 2025

తండ్రి ఉద్యోగం పోతుందన్న భయం: అమెరికాలో 14 ఏళ్ల భారతీయ బాలిక అదృశ్యం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో జరుగుతున్న లేఆఫ్‌ల నేపథ్యంలో తన తండ్రికి ఉద్యోగం పోయి తాను అమెరికాను వదిలి ఇండియాకు వెళ్లిపోవలసి వస్తుందన్న భయంతో ఒక 14 ఏళ్ల ప్రవాస భారతీయ బాలిక గత మూడు వారాలుగా అదృశ్యమైపోయింది. అర్కాన్సాస్ రాష్ట్రంలోని కాన్వేలో నివసించే తన్వి మరుపల్లి జనవరి 17వ తేదీన బస్సులో స్కూలు నుంచి ఇంటికి తిరిగివస్తూ కనిపించకుండా పోయిందంటూ కాన్వే పోలీసు డిపార్ట్‌మెంట్(సిపిడి) తెలిపింది.

టెకీ అయిన తన తండ్రికి ఉద్యోగం పోతే తాము తిరిగి ఇండియాకు వెళ్లిపోవలసి వస్తుందేమోనన్న భయంతో ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటుందని అనుమానిస్తున్నట్లు సిపిడి తెలిపింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నా తమ కుటుంబానికి ఇంకా అమెరికా పౌరసత్వం రాలేదని, తమ కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ఇది కూడా ఒక కారణమని తన్వి కుటుంబ సభ్యులు తెలిపారు. టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న ఉఉద్యోగ రిట్రెంచ్‌ల వల్ల తన ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉండేదని ఒక టెక్ కంపెనీలో పనిచేస్తున్న తన్వి తండ్రి పవన్ రాయ్ మరుపల్లి తెలిపారు.

అయితే ఇప్పుడు తన ఉద్యోగానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని, తాను దేశాన్ని వదిలివెళ్లే అవకాశం ఇక లేదని ఆయన చెప్పారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత ఏడాది నవంబర్ నుంచి దాదాపు 2 లక్షల మంది ఐటి ఉదోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు గుగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమేజాన్ వంటి కంపెనీలలో పనిచేస్తున్నవారే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News