Friday, December 20, 2024

ప్రియుడ్ని వివాహం చేసుకున్న భారత టెన్నిస్ ప్లేయర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత నంబర్ వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ అంకిత, తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ శర్మను పెళ్లి చేసుకుంది. తన వావాహాన్ని అంగరంగా వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ పెళ్లి వరకు తీసుకొచ్చిందని, జంటగా కొత ప్రయాణం మొదులు పెట్టామని మీ అందరి ఆశీర్వాదాలు కావాలని అంకిత తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

దీంతో మీ ప్రయాణం అద్భుతంగా సాగాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంకిత గత ఐదు ఏళ్ల నుంచి టెన్నిస్ ఆడుతోంది. దేశానికి ఎన్నో ట్రోఫీలు సాధించి మంచి పేరు తెచ్చింది. గత కొంతకాలంగా మహిళల సింగిల్స్, డబుల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. డబ్ల్యుటిఎ టూర్‌లో ఒక టైటిల్, డబ్ల్యుటిఎ 125 టోర్నమెంట్‌లో మరో ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య పోటీల్లో ఇప్పటివరకు సింగిల్స్‌లో 11, డబుల్స్‌లో 25 ట్రోఫీలను గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News