Saturday, December 21, 2024

ఇజ్రాయిల్‌లో హమాస్ దాడి: హిందీ టివి నటి సోదరి మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న తన సోదరి, ఆమె భర్తను వారి పిల్లల ముందే హమాస్ ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా చంపివేశారని బాలీవుడ్ నటి ఒకరు వెల్లడించారు. నాగిన్, ఉత్తరన్, బ్రీత్ వంటి వెబ్ సిరీస్, సీరియల్స్‌లో నటించిన మధురా నాయక్ తన సోదరిని హమాస్ ఉగ్రవాదులు దారుణంగా హత్యచేసిన ఉదంతాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

గత ఆదివారం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై దాడి జరిపారని, పట్టపగలు ఇంట్లో ఉన్న తన సోదరి ఉదయ, ఆమె భర్తను పిల్లల ముందే దారుణంగా చంపివేశారని ఆమె తెలిపారు. మహిళలు, పిల్లలు, వృద్ధులనే లక్షంగా చేసుకుని హమాస్ ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారని ఆమె పేర్కొన్నారు. పిల్లల ముందే తన సోదరి ఉదయను, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆమె తెలిపారు. ఉగ్ర దాడిలో తన సోదరి, ఆమె భర్త మరణించడం తనను తీవ్ర విచారానికి గురిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.

హమాస్ ఉగ్రవాదుల నిజస్వరూపం ఏమిటో, వారు ఎంత కిరాతకులో ప్రజలు అర్థం చేసుకోవలసిన సమయం ఇదని ఆమె తెలిపారు. తాను యూదురాలినైనందుకు విద్వేషాన్ని చవిచూడవలసి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

యూదురాలైనందుకు అవమానాలకు, విద్వేషానికి గురవుతున్నానని ఆమె తెలిపారు. ఇ్రజ్రాయిల్ ప్రజలను హంతకులుగా చిత్రీకరిస్తున్న పాలస్తీనా అరబ్ అనుకూల ప్రచారంలో ఎంతవరకు నిజముందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News