Friday, November 15, 2024

విహార నౌకలో అదృశ్యమైన మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

సింగపూర్ : నడి సముద్రంలో క్రూజ్‌షిప్ నుంచి అదృశ్యమైన భారతీయ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. రీటా సహానీ, ( 64) జాకేశ్ సహానీ (70) ఈ భార్యాభర్తలు నాలుగు రోజుల పాటు క్రూజ్‌షిప్ విహార యాత్రకు వెళ్లారు. యాత్రలో చివరిరోజు సోమవారం మలేషియా లోని పెనాంగ్ రాష్ట్రం నుంచి సింగపూర్ వస్తుండగా రీటా సహానీ అదృశ్యమైంది. దాంతో జాకేశ్ సహానీ నౌక లోని సిబ్బందికి వెంటనే తెలియజేయగా, నౌక లోని సిబ్బంది ఓవర్‌బోర్డ్ డిటెక్షన్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశారు.

చివరకు ఆమె ప్రయాణ సమయంలో ఏదో సముద్రంలో పడిపోయినట్టు గుర్తించారు. రీటానే జలసంధిలో దూకినట్టు అధికారులు భావిస్తున్నారు. తన తల్లి మరణాన్ని రీటా కుమారుడు అపూర్వ్ సహానీ ధ్రువీకరించారు. “నౌకా నిర్వాహకులు షేర్ చేసిన ఫుటేజ్ ద్వారా మా అమ్మ చనిపోయిందని తెలిసింది” అని వివరించారు. దీనిపై సింగపూర్ లోని భారత కార్యాలయం కూడా స్పందించింది. ఈ ఘటనపై తాము సహానీ కుటుంబం సింగపూర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News