Monday, December 23, 2024

బాంబుల మోత.. క్షేమంగా బయటపడ్డ భారతీయ కుటుంబం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్ బాంబుల మోతతో దద్దరిల్లుతోన్న గాజాలో చిక్కుకున్న భారతీయ కుటుంబం ఎట్టకేలకు యుద్ధభూమి నుంచి క్షేమంగా బయటపడగలిగింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన లుబ్నా నజీర్ షాబూ, ఆమె కుమార్తె కరీమా సోమవారం సాయంత్రం ఈజిప్టు గాజా మధ్య లోని రఫా సరిహద్దు దాటారు. భారత దౌత్యవేత్తల సాయంతో వారు సురక్షితంగా ఈజిప్టు చేరుకున్నట్టు షాబూ భర్త నెడల్ తోమన్ పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు.

జమ్ముకశ్మీర్‌కు చెందిన నజీర్‌షాబూ కొన్నేళ్లుగా తన భర్త నెడల్ తోమన్, చిన్న కుమార్తె కరీమాలతో కలిసి గాజాలో నివసిస్తున్నారు. ఆమె ఇద్దరు పెద్ద పిల్లలు ఈజిప్టు లోని కైరోలో చదువుకుంటున్నారు. హమాస్‌పై ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్ , గాజాను దిగ్బంధనం చేయడంతో షాబూ కుటుంబం అక్కడ చిక్కుకుపోయింది. ఈనేపథ్యంలో అక్టోబర్ 10న షాబూ పిటిఐ ద్వారా తమను కాపాడాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రమల్లా లోని భారత ప్రతినిధి కార్యాలయం సహకారంతో వారు సోమవారం రఫా సరిహద్దును దాటి ఈజిప్టు చేరుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ ఈజిప్టు లోని అల్ అరిష్ నగరంలో ఉన్నారని , అక్కడి నుంచి కైరో చేరుకుంటారని షాబూ భర్త తోమన్ వెల్లడించారు. తోమన్ ఇంకా గాజా లోనే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News