Thursday, November 14, 2024

భారతీయ మహిళలు మహా సోమరులు: నటి కామెంట్స్ (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: భారతీయ మహిళలు సోమరులంటూ ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత సోనాలీ కులకర్ణి చేసిన వ్యాఖ్యలు ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భూపేంద్ర సింగ్ రాథోర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోనాలీ మాట్లాడుతూ భారతదేశంలో చాలామంది సోమరులైన మహిళలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

చాలామంది మహిళలకు ఒక మంచి ఉద్యోం, ఇల్లు, క్రమం తప్పకుండా ఇంక్రిమెంట్లు లభించే బాయ్ ఫ్రెండ్ లేదా భర్త కావాలి. కాని..ఆ కుటుంబంలో తాను నిర్వహించబోయే భూమికపై పాత్ర సరైన అవగాహన ఉండదు..అంటూ సోనాలీ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై ప్రేక్షకుల నుంచి చప్పట్లను ఆమె కోరడాన్ని కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

ఇందుకు ఉదాహరణగా తన స్నేహితురాలి గురించి సోనాలీ చెబుతూ ఆమె నెలకు రూ. 50,000 సంపాదిస్తూ తన తల్లిదండ్రుల నుంచి దూరంగా విడిగా ఉండే వరుడి కోసం అన్వేషిస్తోందని చెప్పారు. ఇలాంటి మనస్తత్వంగల వారితో వేగబోయే ఆ కాబోయే భర్త పట్ల తాను సానుభూతి చూపుతున్నట్లు ఆమె అన్నారు. మహిళలు కూడా తమ శక్తిసామర్ధాలతో కుటుంబంలో సమానమైన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని సోనాలీ అన్నారు. భార్య కూడా భర్తతో సమానంగా సంపాదించి ఆ కుటుంబానికి అండగా నిలబడాలన్నదే తన ఉద్దేశమని ఆమె వివరించారు.

కాగా.. సోనాలీ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.సమాజంలో మహిళలు ఉద్యోగం చేస్తూ, ఇంటిని చక్కదిద్దుకుంటూ రేయింబవళ్లూ కష్టపడుతున్న విషయం సోనాలీకి తెలియదేమోనంటూ కొందరు వ్యాఖ్యానించారు. అందంగా ఉండి, బాగా చదువుకుని, ఇంటిని చక్కగా చూసుకునే వధువు కావాలంటూ వెలువడే ప్రకటనలు కనపడలేదా అంటూ గాయని సోనా మోహపాత్ర సోనాలీని ప్రశ్నించారు. అయితే మహిళలు సైతం ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నది సోనాలీ అభిప్రాయమంటూ కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News