Friday, November 22, 2024

ఉమెన్స్ టి20 ఆసియా కప్: సెమీస్‌కు భారత్

- Advertisement -
- Advertisement -

దంబుల్లా: ఆసియా కప్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ హ్యాట్రిక్ విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా గ్రూప్‌ఎలో అగ్రస్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం నేపాల్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు యుఎఇపై విజయం సాధించిన పాకిస్థాన్ కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది.

ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, హేమలత జట్టుకు శుభారంభం అందించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షెఫాలీ 48 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 81 పరుగులు సాధించింది. హేమలత ఐదు ఫోర్లు, సిక్స్‌తో 47 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన జెమీమా రోడ్రిగ్స్ 15 బంతుల్లోనే ఐదు ఫోర్లతో అజేయంగా 28 పరుగులు సాధించింది. దీంతో భారత్ మెరుగైన స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు, అరుంధతి, రాధా యాదవ్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News