Sunday, December 22, 2024

విశ్వ వేదికపై మరోసారి భారత పతాకం రెపరెపలాడింది

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: విశ్వ వేదికపై మరోసారి భారత పతాక రెపరెపలాడింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్( ఐబిఎస్‌ఎ) వరల్డ్ గేమ్స్‌లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. వర్షం అంతరాయాల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగా వర్షం కారణంగా భారత్ విజయలక్షాన్ని 42 పరుగులకు కుదించారు.

ఈ లక్షాన్ని కేవలం 3.3 ఓవర్లలో ఒకే వికెట్‌ను కోల్పోయి ఛేదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌తొలి చాంపియన్‌గా భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ టోర్నీలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ఫైనల్‌తో కలుపుకొని ఆస్ట్రేలియాపై 3 సార్లు, ఇంగ్లాండ్‌పై రెండు సార్లు గెలిచింది. మరో వైపు ఇదే టోర్నీ పురుషుల విభాగంలో సైతం భారత జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది.సెమీస్‌లో భారత్..బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News