Friday, January 10, 2025

భారతీయ మహిళలు విటమిన్ ’డి’ లోపంతో పోరాటం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ మహిళలు విటమిన్ ’డి’ లోపంతో పోరాడుతున్నారని అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ’స్ట్రాన్ ఉమెన్ స్ట్రాంగ్ భారత్’ థీమ్తో అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (జూబ్లీ హిల్స్) లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అపోలో క్రెడిల్ విటమిన్ ‘డి’ పరీక్షను అత్యంత తక్కువ ధరతో రూ. 199 కే నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన నటి కుశిత కల్లాపు మాట్లాడుతూ 90 శాతం మంది మహిళలు ఈ సమస్యతో సతమతమవుతున్నారని చెప్పారు. ఇది స్త్రీ ఎముకల ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందన్నారు. అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (జూబ్లీ హిల్స్) కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల మాట్లాడుతూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే ప్రగతిని వేగవంతం చేయవచ్చాని, వివిధ రంగాలలో పోటీ పడుతున్నప్పుడు సహజమైన సామర్థ్యాన్ని కోల్పోకూడదన్నారు. సాధికారత పొందిన మహిళ నిజమైన సంకేతం.. ఆమె ఎంతమందికి అధికారం ఇవ్వగలదన్న దానిపై ఆధారపడి ఉంటుందన్నారు.

మనిషి మీకు కావాల్సిన ప్రపంచాన్ని సృష్టించే వరకు వేచి ఉండేకన్నా, దానిని మీరే సృష్టించుకోవాలని తెలిపారు. ఈ ప్రకృతే ఆ శక్తిని ఇచ్చిందన్నారు. ఈ ప్రయాణంలో పురుషులను చేర్చుకోవాలని, ఆహ్లాదకరంగా మార్చుకోవాలని చెప్పారు. ఆరోగ్యపరంగా స్త్రీలందరూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి గోగినేని మాట్లాడుతూ భారతీయ స్త్రీలందరికీ విటమిన్ డి లోపం ఉందన్నారు.

వేషధారణ వల్ల కావచ్చు లేదా సూర్యరశ్మి తగలకపోవడం వల్ల కావచ్చు అన్నారు. ఇది ఇది విటమిన్ డికి ప్రధాన మూలమన్నారు. విటమిన్ డి లోపం అనేక లక్షణాలతో ముడిపడి ఉంటుందన్నారు. ప్రసూతి వైద్యురాలు, గైనకాలజిస్ట్ అండ్ ల్యాప్ సర్జన్ డాక్టర్ హారిక బోనం మాట్లాడుతూ సాధారణ బీఎంఐ నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు. సాధారణ బీఎంఐ స్థాయిలు ఋతు సమస్యల నుంచి విముక్తి పొందేలా చేస్తాయన్నారు. గర్భం ధరించడంలో సమస్యలు, మెనోపాజ్ ఆందోళనలు తగ్గించబడతాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News