Monday, November 25, 2024

టీమిండియాకు రెండో విజయం

- Advertisement -
- Advertisement -

దంబుల్లా : మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత్ రెండో విజయాన్ని నయోదు చేసింది. ఆదివారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్ సేన 78 పరుగులతో ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లలో భారత్ సత్తా చాటింది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ 66 (47 బంతుల్లో 7×4, 1×6), రిచా ఘోష్ 64 నాటౌట్ (29 బంతుల్లో 12×4, 1×6)లు అర్థ శతకాలతో వీరవిహారం చేశారు.

యూఏఈ బౌలర్లను ఓ ఆటాడుతుకున్నారు. ఇక వీరిద్దరికీ తోడు ఓపెనర్ షెఫాలీ వర్మ 37 (18 బంతుల్లో 5×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. అనంతరం లక్ష ఛేదనకు దిగిన యూఎఈని టీమిండియా బౌలర్లు 123 పరుగులకే కట్టడి చేసింది. యూఏఈ బ్యాటర్లలో ఇషా రోహిత్ ఓజా(38), కవీషా ఇగొదగే(40)లు మాత్రమే రాణించారు. మిగతవారు టీమిండియా బౌలర్ల దాటికి పెవిలియన్‌కు వరుస కట్టారు. ఇక భారత బౌలర్లలో దీపాళి శర్మ 2 వికెట్లు పడగొట్టగా.. రేణుక, రాధా, తనుజా, పూజా వస్త్రేకర్‌లు తలో వికెట్ సాధించారు. కాగా, ఈ విజయంతో టీమిండియా టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది.

భారత్‌కు శుభారంభం దక్కలేదు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ స్మృతి మంధాన(13) వికెట్ కోల్పోయింది. స్మృతి ఔటైనా షెఫాలీ వర్మ దూకుడుగా ఆడింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన ఆమె కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన దయాలన్ హేమలత(2) క్లీన్ బౌల్ అవ్వడంతో 52 పరుగులకే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జెమీమాతో కలిసి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెలరేగింది. 54 పరుగులు జోడించిన అనంతరం జెమీమా(14) ఔటవ్వగా.. రిచా ఘోష్ సాయంతో హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.

రిచా ఘోష్ వరుస బౌండరీలతో యూఏఈ బౌలర్లపై విరుచుకుపడింది. ఈ క్రమంలో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రిచా ఘోష్ జట్టు స్కోర్‌ను 200 ధాటించింది. చివరి ఓవర్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌటైనా.. పూజావస్త్రాకర్ సాయంతో చివరి 5 బంతుల్లో 20 పరుగులు రాబట్టింది. చివరి 5 బంతులను వరుసగా బౌండరీకి తరలించింది. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తోనే అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News