Thursday, November 21, 2024

అదరగొట్టిన దీప్తి, పూజా

- Advertisement -
- Advertisement -

Indian women's cricket team won first ODI against Sri Lanka

లంకపై భారత మహిళల విజయం

పల్లెకెలె: శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డే భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 10 ఆధిక్యాన్ని సాధించింది. దీప్తి శర్మ ఆల్‌రౌండ్‌షోతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 38 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన 4 పరుగులు మాత్రమే చేసి ఔటైంది. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ యస్తిక భాటియా (1) నిరాశ పరిచింది. దీంతో భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను మరో ఓపెనర్ షఫాలి వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తమపై వేసుకున్నారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. షఫాలి ధాటిగా ఆడుతూ జట్టును లక్షంగా దిశగా నడిపించింది. అయితే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 35 పరుగులు చేసిన షఫాలి వర్మను రణవీర వెనక్కి పంపింది.

కానీ తర్వాత వచ్చిన హర్లిన్ డియోల్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ పోరాటం కొనసాగించింది. ఇద్దరు మధ్య కీలక పార్ట్‌నర్‌షిప్ నమోదైంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ 3 ఫోర్లతో 44 పరుగులు చేసి వెనుదిరిగింది. ఆ వెటనే హర్లిన్ కూడా పెవిలియన్ చేరిది. 34 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఈ రెండు వికెట్లు కూడా రణవీర ఖాతాలోకే వెళ్లాయి. మరోవైపు రిచా ఘోష్ (6) జట్టుకు అండగా నిలువలేక పోయింది. కానీ దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ అద్భుత బ్యాటింగ్‌తో మరో వికెట్ కోల్పోకుండానే భారత్‌కు విజయం సాధించి పెట్టారు. ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించిన దీప్తి శర్మ 22 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇక పూజా రెండు సిక్సర్లతో అజేయంగా 21 పరుగులు సాధించింది. దీంతో భారత్ 38 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

రేణుక, దీప్తి మ్యాజిక్..

అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. సమష్టిగా రాణించిన భారత బౌలర్లు లంకను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. దీప్తి శర్మ, రేణుక సింగ్ మూడుసి వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇక లంక జట్టులో హసిని పెరెరా (37), మాదవి (28), నీలాక్షి డిసిల్వా (43) మాత్రమే రాణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News