Sunday, January 19, 2025

ఆస్ట్రేలియా టూర్‌కు మహిళా హాకీ జట్టు ఎంపిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత మహిళా హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. మే 18 నుంచి 27 వరకు భారత టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ కోసం 20 మందితో కూడా టీమ్‌ను ఎంపిక చేశారు. సీనియర్ క్రీడాకారిణి సవిత పునియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. దీప్ గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించనుంది. సిరీస్‌లో భారత్ మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు అడిలైడ్‌లోనే జరుగనున్నాయి. రానున్న ఆసియా క్రీడలకు సన్నాహకంగా భారత టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.

జట్టు వివరాలు:
గోల్ కీపర్లు: సవిత పునియా (కెప్టెన్), బిచ్చు దేవి
డిఫెండర్స్: దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), నిక్కి ప్రధాన్, ఇషికా చౌదరి, ఉదిత, గుర్జీత్ గౌర్
మిడ్‌ఫీల్డర్స్: నిశా, నవ్‌జోత్ కౌర్, మోనికా, సలీమా, నెహా, నవ్‌నీత్ కౌర్, సోనికా, జ్యోతి, బల్జీత్ కౌర్
ఫార్వర్డ్: లాల్‌రెమ్‌సియామి, వందన కటారియా, సంగీతా కుమారి, షర్మిలా దేవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News