Sunday, January 19, 2025

ఆసియా టెబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళలకు కాంస్యం

- Advertisement -
- Advertisement -

ఇక్కడ జరుగుతున్న ఆసియా టెబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు నయా చరిత్ర సృష్టించింది. కజకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న టోర్నమెంట్‌లో భారత మహిళా టీమ్ కాంస్య పతకం గెలిచి చరిత్రను తిరగరాసింది. ఆసియా మహిళల టిటి టీమ్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. బుధవారం జపాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 13 తేడాతో పరాజయం చవిచూసింది. మరో సెమీస్‌లో చైనా చేతిలో హాంకాంగ్ ఓటమి పాలైంది. ఆసియా టిటి పోటీల్లో సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్య పతకాలను అందించడం అనవాయితీ.

దీంతో భారత మహిళా టీమ్ తొలి సారి ఆసియా టిటిలో పతకం గెలిచి నయా రికార్డు నెలకొల్పింది. జపాన్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ కనీస పోటీని కూడా ఇవ్వలేక పోయింది. తొలి సింగిల్స్‌లో ఐహిక ముఖర్జీ ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌లో సీనియర్ క్రీడాకారిణి మనిక బాత్రా జయకేతనం ఎగుర వేసింది. కానీ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో సుతీర్థ ముఖర్జీ, మనిక బాత్రా పరాజయం పాలయ్యారు. దీంతో భారత్ ఫైనల్ ఆశలను తెరపడింది. ఈ మ్యాచ్‌లో ఓడినా భారత్‌కు కాంస్యం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియా 32తో నెగ్గి పతకం ఖరారు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News