హైదరాబాద్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ జైళ్ళలో మగ్గుతున్న బాధితులను కేంద్రం ప్రభుత్వ సాయంతో స్వదేశానికి తీసుకొస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన కొందరు దుబాయిలో సంవత్సరాల తరబడి జైళ్ళలోనే ఉన్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామన్నారు. బిజెపి 13వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం కోరుట్ల నియోజకవర్గం మోహన్ రావు పేట గ్రామస్థులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా గల్ఫ్ బాధిత కుటుంబాలతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి అనేక మంది పేదలు పొట్టకూటి కోసమే దుబాయ్ వ ంటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, ఈ క్రమంలో అక్కడ వివిధ కారణాలతో ఉపాధి లభించక చిక్కుకుపోవడం దురదృష్టకరమన్నారు. గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ కార్మికుల రక్షణ కోసం తక్షణ పాలసీ తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.
గల్ఫ్ బాధితులను ఆదుకుంటాం:బండి సంజయ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -