Sunday, December 22, 2024

డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై భారత రెజ్లర్ల ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌) అధ్యక్షుడు వైఖరిపై ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షిమాలిక్ తదితరులు ధ్వజమెత్తారు. డబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడుబ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా రెజ్లర్ వినేశ్ ఆరోపించింది. ఈక్రమంలో భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్యక్రమంలో నిర్వహించారు. రెజ్లింగ్‌లో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురేసిన తమను ఫెడరేషన్ అసంబద్ధమైన నిబంధనలతో మనోవేదనకు గురించేస్తోందని విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత రెజర్ల చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఒలింపియన్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్ తదితర ప్రముఖ భారత రెజ్లర్లు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఆసియా గేమ్స్‌తోపాటు కామన్‌వెల్త్ గేమ్స్‌లోనూ బంగారు పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన వినేశ్ మాట్లాడుతూ కోచ్‌లు మహిళా రెజ్లర్లను వేధిస్తున్నారని ఆరోపించారు.

ఫెడరేషన్‌కు అభిమాన కోచ్‌లుగా ఉన్న కొంతమంది మహిళా కోచ్‌లను వేధిస్తున్నారని, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఫోగాట్ ఆరోపించారు. డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడు చాలా మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మీడియాకు తెలిపారు. డబ్ల్యూఎఫ్‌ అధికారులు చంపేస్తామని తనను బెదిరించినట్లు వినేశ్ ఫొగాట్ వెల్లడించారు. ఆరోపణలపై డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడు శరణ్ సింగ్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో మునుపెన్నడూ ఫెడరేషన్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నామని రెజ్లర్లు ఎందుకు ఆందోళన చేయలేదని ప్రశ్నించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన నియమ, నిబంధనలను ప్రవేశపెట్టడం సమస్యాత్మకంగా భావించి ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పాల్గొన్న రెజ్లర్లు ఒలింపిక్స్ తర్వాత జాతీయ టోర్నమెంటులోనూ పోటీపడలేదని సింగ్ అన్నారు. ఫెడరేషన్‌కు రెజ్లర్లు అందరూ కావాలి. వారిస్థాయితో సంబంధం లేకుండా రెజ్లర్లు ట్రయల్స్‌లో పాల్గొనాలి.

ఆందోళన నిర్వహించడానికి ఇది కూడా ఓ కారణమన్నారు. కాగా 2022 కామన్‌వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత పూనియా మాట్లాడుతూ..రెజ్లర్లను డబ్లూఎఫ్‌ఐ ఏకపక్ష నియమ, నిబంధనలతో వేధిస్తుందని ఆరోపించారు. రెజ్లింగ్ క్రీడ గురించి తెలియనివారు కూడా డబ్లూఎఫ్‌ఐలో భాగస్వాములుగా ఉన్నారని పూనియా విమర్శించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియంతృత్వ ధోరణిని సహించమన్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మేనేజ్‌మెంట్‌ను మార్చాలని పూనియా కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నామని టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ ఫోగట్ మాట్లాడుతూ టోక్యో ఒలింపిక్స్‌లో ఓటమి అనంతరం అధ్యక్షుడు పిలిచి విలువలేని సిక్కా’ అని వేధించాడు.

ప్రతిరోజూ జీవితం ముగిసిపోయిందని మానసిక అనుభవించాను అనితెలిపారు. ఏ రెజ్లరుకు ఏమి జరిగినా దానికి డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడిదే బాధ్యత అని వినేశ్ వ్యాఖ్యానించింది. రెజర్ల ఆందోళనపై డబ్లూఎఫ్‌ఐ కార్యదర్శి తోమర్ మాట్లాడుతూ ప్రముఖ రెజ్లర్లందరూ ఫెడరేషన్‌తో భేటీ అయితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కాగా మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణలపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించి సుమోటోగా స్వీకరించింది. క్రీడా కార్యదర్శికి మహిళా కమిషన్ లేఖ రాసింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివరాలు వెల్లడించాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News