Wednesday, January 22, 2025

ఫుట్‌పాత్‌పై రాత్రి నిద్ర: మహిళా రెజ్లర్ల నిరసన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆరుబయట ఫుట్‌పాత్‌పై ఆదివారం రాత్రి నిద్రించి అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు తమ నిరసన తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను దర్యాప్తు చేసిన కమిటీ తన నివేదికను వెంటనే బయటపెటాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు ఫుట్‌పాత్‌పై నిద్రించారు.
ఢిల్లీ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మహిళా రెజ్లర్ల ఫోటోలను ప్రముఖ రెజ్లర్ దినేష్ ఫోగట్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా..భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ నియమించిన కమిటీ తన నివేదికను అందచేయాలని ఢిల్లీ పోలీసులు కోరారు.

Also Read: అతనినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్

సింగ్‌పై ఏడు ఫిర్యాదులు అందాయని, వీటన్నిటినీ దర్యాప్తు చేస్తున్నామని, పక్కా ఆధారాలు దొరికిన తర్వాత సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ప్రముఖ బాక్సర్ మేరీకోం సారథ్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ గతంలోనే ప్రకటించారు. బిజెపి నాయకుడు, రెజ్లర్ అయిన భూషణ్ శరణ్ సింగ్‌కు నేర చరిత్ర కూడా ఉంది. మహిళా రెజ్లర్లపై సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఏప్పిల్ 21న మహిళా రెజ్లర్లు ఏప్రిల్ 21న సిపి పోలీసు స్టషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News