- Advertisement -
భారత్‌కు రెంతు పతకాలు ఖాయం
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. మరో బాక్సర్ మనీషా కూడా క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించి మరో పతకం ఖాయం చేసింది. సోమవారం జరిగిన మహిళల 52 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్ పోరులో తెలుగుతేజం నిఖత్ జరీన్ 50 తేడాతో ఇంగ్లండ్ బాక్సర్ చార్లీ డేవిసన్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచే తనదైన పంచల్‌తో ప్రత్యర్థిపై విరుచుకు పడిన నిఖత్ అలవోక విజయాన్ని అందుకుంది. మరోవైపు 57 కిలోల విభాగంలో మనీషా ముందంజ వేసింది. క్వార్టర్ ఫైనల్లో మనీషా 41 తేడాతో మంగోలియా బాక్సర్ నమున్ మోంఖోర్‌ను ఓడించింది. కాగా 48 కిలోల విభాగంలో భారత బాక్సర్ నీతూ క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది.
- Advertisement -