Sunday, December 22, 2024

విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష “టోఫెల్ ”

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశించడానికి , సర్టిఫికెట్లు పొందడానికి నిర్వహించే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజి (టివొఇఎఫ్‌ఎల్ టోఫెల్ )కు హాజరయ్యే భారతీయుల సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. ఇదే సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనం కోసం నిర్వహించే పరీక్షకు హాజరయ్యేవారి శాతం తగ్గుతోందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ( ఇటిఎస్) అధ్యయనం వెల్లడించింది. ప్రిన్సిటన్ కేంద్రంగా పనిచేసే ఇటిఎస్ సంస్థ ఈ టివొఇఎఫ్‌ఎల్ పరీక్షతోపాటు గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ (జిఆర్‌ఇ)ను నిర్వహిస్తోంది.

ఈ పరిణామం అభ్యర్థుల ఆకాంక్షల్లో మార్పును సూచిస్తోందని ఇటిఎస్ వెల్లడించింది. పిటిఐకి ప్రత్యేకంగా లభించిన డేటా ప్రకారం ఈ పరీక్షకు హాజరు కావాలనుకున్న అభ్యర్థుల శాతం రానురాను పెరుగుతోంది. అభ్యర్థుల శాతం 2021లో 5.89 శాతం నుంచి 2022లో 7.77 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఉద్యోగాల కోసం, లేదా ఇమ్మిగ్రేషన్ కోసం ఈ పరీక్షకు హాజరయ్యేవారి శాతం 8.19 శాతం నుంచి 7.22 శాతానికి క్షీణించింది. 2018 నుంచి ఈ ట్రెండ్‌ను తాము గమనిస్తున్నామని ఇటిఎస్ ఉన్నతాధికారులు తెలిపారు.బిజినెస్ ప్రోగ్రామ్‌లు కాకుండా, గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ బిజినెస్ ప్రోగ్రామ్‌ల కోసం ఈ పరీక్షకు హాజరవుతున్న భారతీయుల సంఖ్య 2021లో 70.84 శాతం ఉండగా, 2022లో 71.87 శాతానికి పెరిగింది.

ఇది యువజనాభాలో ఆకాంక్షల్లో మార్పుకు ఉదాహరణ అని ఇటిఎస్ ఇండియా, దక్షిణాసియా మేనేజర్ సచిన్ జైన్ వెల్లడించారు. అంతకుముందు సంవత్సరం కన్నా 2021లో ఈ పరీక్ష రాయాలనుకున్న అభ్యర్థుల సంఖ్య 53 శాతం పెరిగిందని, 2022లో 59 శాతం పెరిగిందని వివరించారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో విదేశాలకు వెళ్లనున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2.5 మిలియన్‌కు చేరుకుంటుందని అనేక పారిశ్రామిక నివేదికలు అంచనా వేస్తున్నాయని వివరించారు. మరో ముఖ్య విషయం భారతీయ ప్రతిభావంతుల పట్ల విదేశాలు మొగ్గు చూపుతుండడం గమనార్హం. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ దేశాలు ఈ వరుసలో ఉన్నాయి.

ఈ పరీక్ష రాసే అభ్యర్థులు భారత్‌లో న్యూఢిల్లీ , ముంబై, బెంగళూరు, పునె, హైదరాబాద్, గురుగ్రామ్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల నుంచే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. జులై 26 నుంచి ఈ ఇటిఎస్ పరీక్షలో కొన్ని మార్పులు చేశారు. ఎవరైతే మూడు గంటలు కాకుండా రెండు గంటల్లోనే పరీక్ష రాయడం పూర్తి చేస్తారో ఆయా అభ్యర్థులు తమకు వచ్చిన మార్కుల స్కోరు తేదీని ముందుగా తెలుసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News