Wednesday, January 8, 2025

యుఎస్‌లోని భారతీయులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

హెచ్1బి వీసా ఉన్నవారు అమెరికాను వీడకుండానే తమ పత్రాలను రెన్యూ చేసుకునేందుకు అనుమతించే ఒక రెన్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నదని న్యూఢిల్లీలోని అమెరికన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. హెచ్1బి వీసాదారుల కోసం యుఎస్ ఆధారిత రెన్యువల్ కార్యక్రమం ఈ సంవత్సరమే అమలు కావచ్చు. ప్రత్యేక ఉద్యోగాల్లో ఉన్న భారతీయ సిబ్బంది అనేక మందికి ఆ కార్యక్రమం ఒక వరం కానున్నది. వారు తమ వీసాలను రెన్యూ చేయించుకోవడానికి. తిరిగి ముద్ర వేయించుకోవడానికి గాను ప్రస్తుతం స్వదేశానికి తిరిగి రావలసి వస్తోంది. యుఎస్‌లోనే హెచ్1బి వీసాల రెన్యువల్‌కు ఒక పైలట్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకున్నది. ‘యుఎస్‌ను వీడకుండాను తమ వీసాలను రెన్యు చేసుకునేందుకు ప్రత్యేక ఉద్యోగాల్లో ఉన్న అనేక మంది భారతీయ సిబ్బందికి ఇది వీలు కల్పిస్తోంది.

ఈ పైలట్ కార్యక్రమం వేలాది మంది దరఖాస్తుదారులకు రెన్యువల్ ప్రక్రియను క్రమబద్ధం చేసింది. 2025లో యుఎస్ ఆధారిత రెన్యువల్ కార్యక్రమాన్ని లాంఛనంగా ఏర్పాటు చేయడానికి విదేశాంగ శాఖ కృషి చేస్తోంది’ అని రాయబార కార్యాలయం ఏడాది చివరి ప్రకటనలో తెలియజేసింది. హెచ్1బి వీసాలు రెన్యు చేయడానికి, తిరిగి ముద్ర వేయించుకోవడానికి భారత్‌కు తిరిగి రావలసి ఉండడం యుఎస్‌లోని భారతీయ సిబ్బందికి దీర్ఘకాలంగా ఒక సమస్యగా ఉన్నది. ఆ ప్రక్రియ కోసం నిర్ధారిత అపాయింట్‌మెంట్ స్లాట్లు పొందడం ఒక్కొక్కసారి కష్టంగా ఉంటున్నది. యుఎస్‌లో హెచ్1బి వీసాలపై తీవ్ర స్థాయిలో చర్చ సాగుతున్న నేపథ్యంలో కూడా ఈ పరిణామం చోటు చేసుకుంటున్నది. భారతీయ నైపుణ్య సిబ్బందికి జారీ చేస్తున్న హెచ్1బి వీసాలు విదేశీ కార్మికులు, అమెరికన్ ఉద్యోగాల గురించి చర్చల్లో వివాదాంశంగా ఉంటున్నది. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నవారు హెచ్1బి వీసాదారులు,

ముఖ్యంగా భారత్ నుంచి వస్తున్నవారు అమెరికన్ సిబ్బంది స్థానాన్ని ఆక్రమిస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పు తెస్తున్నారని వాదిస్తున్నారు. అయితే, హెచ్1బి వీసా పథకాన్ని ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి ప్రముఖులతో పాటు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. యుఎస్‌లో ఇంజనీర్ల కొరత నడుమ నిపుణులైన విదేశీ సిబ్బందిని ఆకర్షించడం అవసరమని ట్రంప్ నొక్కిచెప్పారు. హెచ్1బి వీసాదారులకు రెన్యువల్ ప్రక్రియను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించినదే హెచ్1బి పైలట్ కార్యక్రమం. వారు ఇంతకు ముందు వీసా రెన్యువల్ నిమిత్తం స్వదేశానికి వెళ్లవలసి వచ్చేది. ఈ కార్యక్రమం విజయం విదేశాంగ శాఖకు 2025లో యుఎస్ ఆధారిత రెన్యువల్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మార్గం సుగమంచేసింది. ఈ పరిణామం ముఖ్యంగా భారతీయ సిబ్బందికి ప్రయోజనకరం. వారు హెచ్1బి వీసా లబ్ధిదారుల్లో అత్యధిక సంఖ్యాకులు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్యం, ఆర్థికం వంటి ప్రత్యేక రంగాల్లో విదేశీ సిబ్బందికి హెచ్1బి వీసాలు జారీ చేస్తుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News