Thursday, December 26, 2024

భారతీయులు వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లవచ్చు

- Advertisement -
- Advertisement -

పాస్ పోర్టు ఉంటే చాలు… భారతీయులు వీసా లేకుండా 62 దేశాలకు వెళ్లవచ్చు. శక్తిమంతమైన పాస్ పోర్టులు గల దేశాల జాబితాలో ఇండియా 80వ స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని బట్టి ఖతర్, ఒమన్, నేపాల్, భూటాన్, థాయ్ లాండ్, ట్రినిడాడ్ అండ్ టుబాగో, జింబాబ్వే వంటి దేశాలకు ఇండియన్స్ వీసా లేకుండా వెళ్లవచ్చు.

జాబితాలో ఆరు దేశాల పాస్ పోర్టులు అత్యంత శక్తిమంతమైనవిగా నిలిచాయి. ఇందులో సింగపూర్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పౌరులు 194 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇక దక్షిణ కొరియా, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు రెండోస్థానంలో ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన ప్రయాణికులు 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. మూడోస్థానంలో ఉన్న ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లండ్, నెదర్లాండ్స్ దేశాల పాస్ పోర్టులతో 192 దేశాలకు వెళ్లవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News