Tuesday, November 5, 2024

డీమానిటైజేషన్‌కు నేటితో ఆరేళ్లు… మరి సాధించిందేమిటో?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 2016 నవంబర్ 8న (ఇదే రోజున) ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేశారు. రాత్రి 12 గంటల నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని హుకూం జారీ చేశారు. మహిళలు, ముసలి అని చూడకుండానే అందరినీ బ్యాంకుల ముందు లైను కట్టేలా చేశారు. బ్యాంకు వద్ద పెద్ద లైను కట్టాక తమ దగ్గర ఉన్న ఆ పాత నోట్లను మార్చుకోడానికి ఓ ఫారమ్ తీసుకుని తన పేరు వగైరా, తమ నోట్ల నంబర్లు అందులో రాసి, సంతకం పెట్టి అక్కడి క్యాషియర్‌కు ఇచ్చి మార్చుకోవలసి వచ్చింది. “అచ్చే దిన్ ఆయేగా అంటూ చుక్కలు చూపించాడు”. దేశవ్యాప్తంగా లైను కట్టిన వారిలో దాదాపు 150 మంది ప్రాణాలు పోయాయి.

ఇప్పుడు ఆరేళ్లు పూర్తయ్యాక ఆయన చెప్పిన విషయం, వాస్తవం మధ్య చాలా తేడా కనిపిస్తోంది. నాటి నోట్ల రద్దుతో ఒనగూడిన ప్రయోజనం ఏమిటో మోడీ ఇప్పటికీ నోరు విప్పడంలేదు. నల్ల ధనం ఇంకా పెరిగిపోయిందని మరో ప్రక్క ప్రతిపక్షాలు కోడైకూస్తున్నాయి. మునుపటి కంటే ఇప్పుడు నగదుపై ఆధారపడేవారి సంఖ్య మరింత రెట్టింపయిందని నిపుణులు అంటున్నారు. డీమానిటైజేషన్ నాటికి దేశంలో 17.74 లక్షల కోట్ల కరెన్సీ ఉండగా, నేడు 31.81 లక్షల కోట్ల కరెన్సీ ఉంది. ఈ లెక్కన ఈ ఆరేళ్లలోనే 14.07 లక్షల కోట్ల విలువ కరెన్సీ పెరిగిపోయింది. ఓ పక్క డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ, మరోప్రక్క కరెన్సీ చెలామణి అంతకంతకూ పెరుగుతోంది. అసలు జరుగుతున్నదేమిటో చదువుకున్న వారికి కూడా అంతుపట్టడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News