Monday, January 20, 2025

మోడీ ఈవెంట్‌పై ఇండో అమెరికన్ల ఉసూరు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఈ వారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జరిపే తొలి అమెరికా పర్యటన షెడ్యూలు భారతీయ సంతతివారికి నిరాశనే మిగిల్చింది. పలు తీరికలేని కార్యక్రమాల నేపథ్యంలో భారతీయ సంతతితో ఇష్టాగోష్టి ప్రోగ్రాంను కుదించారు. పైగా దీనికి హాజరయ్యే వారి సంఖ్యలో కూడా కోత విధించారు. వాషింగ్టన్ డిసిలో అతి కొద్ది మందితో ఈ భేటీ జరుగుతుంది. ప్రధాని మోడీ రాక సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాలని భారతీయ సంతతి సంస్థల నేతలు చాలాకాలంగా వేచి ఉన్నారు. అయితే ఇప్పుడు ఖరారు అయిన ప్రోగ్రాంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. తాము మోడీ గౌరవార్థం చికాగోలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టాలనుకున్నామని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఛైర్మన్ భారత్ బరాయ్ తెలిపారు. కానీ ఇప్పుడు వాషింగ్టన్ డిసిలో ఈ ఈవెంటు ఉంటుంది.

దీనికి వేయి మంది హాజరుకానున్నారు. ఆంకాలిజిస్టు డాక్టరు అయిన బరాయ్ ప్రధాని మోడీ చికాగో ఈవెంట్ రద్దు కావడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. నిజానికి చికాగోలో యునైటెడ్ సెంటర్ వేదికలో ముందు ప్రధాని మోడీ కార్యక్రమం ఖరారు చేశారని, కానీ ఆ తరువాత 40వేల మందికిపైగా కూర్చునే సోల్జర్ ఫీల్డ్ స్టేడియంను తాము రిజర్వ్ చేశామని , అదే విధంగా ఇలినాయిస్ వర్శిటీలో కూడా ప్రధాని ఇంటరాక్షన్‌కు ఏర్పాట్లు జరిగాయని , కానీ ఇప్పుడు చికాగోకు ప్రధాని రావడం లేదని బరాయ్ చెప్పారు. దీనితో ప్రధాని మోడీ రాక సందర్భంగా దూరప్రాంతాలలోని పలువురు భారతీయ అమెరికన్లు వాషింగ్టన్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తమ దేశ ప్రధాని ఇక్కడికి వస్తే తాము చూడకుండా ఉంటామా? అని చెపుతున్నారు.

ఈ నెల 22న మోడీకి వాషింగ్టన్‌లో అధికారిక స్వాగతం ఉంటుంది. అంతకు ముందు రోజు ఆయన అమెరికాకు చేరుకోగానే న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయం వద్ద జరిగే యోగాదినోత్సవానికి సారధ్యం వహిస్తారు. వాషింగ్టన్‌లో జరిగే ప్రధాని మోడీ ఈవెంట్‌లో ఆఫ్రికన్ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ ఆటాపాట ప్రదర్శన ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News