Saturday, September 14, 2024

అమెరికాలో చిక్కుల్లో ప్రవాస భారతీయులు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: చిన్నతనంలోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లిన భారతీయ యువతీయువకులు అక్కడ దేశ బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వారికి శాశ్వత నివాస అర్హత, తాత్కాలిక వీసా లభించక తిరిగి స్వదేశానికి (భారత్ కు) రావల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికాలో ఇలాంటి వారిని ‘డాక్యుమెంటెడ్ డ్రీమర్స్’ అంటారు. వీరి సంఖ్య 2.5 లక్షలకు పైనే ఉంటుంది.

అమెరికా నిబంధన ప్రకారం తల్లిదండ్రులతో అమెరికాకు వచ్చే చిన్నారులను వీసాదారులపై ఆధారపడ్డ వారిగా పరిగణిస్తారు.  వారికి అక్కడ 21 ఏళ్ల వరకు ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే ఓకే.  లేకపోతే వారిని వయసు మీరిందంటూ గ్రీన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. దానిని ‘ఏజ్ ఔట్’ అని పిలుస్తారు.  స్వంతంగా వీసాకు ప్రయత్నించి విఫలమైతే తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలి. ఇప్పటికీ గ్రీన్ కార్డు దొరకని భారతీయులు చాలా మందే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News