Wednesday, January 22, 2025

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము… 50 శాతం జంప్!

- Advertisement -
- Advertisement -
Indians Money in Swiss Bank
భారతీయ వ్యక్తులు,  సంస్థలు స్విస్ బ్యాంకుల్లో దాచిన నిధులు 2021లో 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి అంటే, 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ. 30,500 కోట్లకు పైగా) పెరిగింది.

న్యూఢిల్లీ/జూరిచ్: భారతదేశానికి చెందిన శాఖలు ,  ఇతర ఆర్థిక సంస్థలతో సహా స్విస్ బ్యాంకుల్లో భారతీయ వ్యక్తులు,  సంస్థలు దాచుకున్న నిధులు 2021లో 14 సంవత్సరాల గరిష్ట స్థాయికి అంటే,  3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (రూ.  30,500 కోట్లకు పైగా) పెరిగాయి. సెక్యూరిటీలు,  సారూప్య సాధనాల ద్వారా హోల్డింగ్‌లలో వేగవంతమైన పెరుగుదల ఉంది.  కస్టమర్ డిపాజిట్లు కూడా పెరిగినట్లు  స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ నుండి వార్షిక డేటా గురువారం తెలిపింది.
వరుసగా రెండో సంవత్సరం కూడా భారతీయుల సంపద స్విస్ బ్యాంక్ లో పెరిగింది. 2020లో భారతీయుల సంపద స్విస్ బ్యాంకులో 2.55 స్విస్ ఫ్రాంక్లు (రూ. 20700 కోట్లు) ఉండగా ఇప్పుడది  రూ. 30500 కోట్లకు పైగా పెరిగింది.

అంతేకాకుండా, భారతీయ కస్టమర్ల సేవింగ్స్ లేదా డిపాజిట్ ఖాతాల్లో ఉన్న డబ్బు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి అంటే,  రూ. 4,800 కోట్లకు పెరిగింది, ఇది రెండేళ్ల క్షీణత ధోరణికి రివర్స్ అనే చెప్పాలి.

స్విట్జర్లాండ్‌లోని భారతీయ నివాసితులు కలిగి ఉన్న ఆస్తులను ‘నల్లధనం’గా పరిగణించలేమని స్విస్ అధికారులు ఎల్లప్పుడూ సమర్థిస్తూనే ఉన్నారు,  పన్ను మోసం, పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో వారైతే యాక్టివ్ గా మద్దతు ఇస్తుంటారు. కానీ…మరో కోణం వేరేగా ఉంటుంది(దాన్ని జుమ్లేబాజీగా అర్థం చేసుకోవాలి).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News