కోల్‌కతా: విదేశీ క్రికెటర్లతో పోల్చితే మానసిక ఆరోగ్య సమస్యలను భారత ఆటగాళ్లు మరింత మెరుగ్గా ఎదుర్కొంటారని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్ ఆడడం ఎవరికైనా చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. అయినా భారత క్రికెటర్లు ఇలాంటి క్లిష్టమైన స్థితిని చాలా దీటుగా ఎదుర్కొంటున్నారని ప్రశంసించాడు. ఏ రంగంలో ఉన్న ఒడిదొడుకులు తప్పవన్నాడు. కరోనా వల్ల ప్రస్తుతం క్రికెటర్లందరూ బయో బుడగల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. ఇందులో ఉండడం చాలా క్లిష్టమైన అంశమన్నాడు.
అయితే, ఆటలో ఇలాంటి పరిస్థితులు సహాజమేనన్నాడు. ఇక విదేశీ క్రికెటర్లతో పోల్చితే భారతీయుల్లో ఒత్తిడిని తట్టుకునే సత్తా కాస్త అధికంగా ఉంటుందన్నాడు. తాను ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడాను. అప్పుడూ వారి మానసిక పరిస్థితి దగ్గరగా గమనించాడు. ఆ సమయంలో వారు చాలా సున్నితంగా ఉంటారనే విషయం అర్థమైందన్నాడు. మానసిక సమస్యను మనలాగా గట్టిగా ఎదుర్కొలేరనే విషయం స్పష్టమైందన్నాడు. ఇక బయోబబుల్ నిధంనల ప్రకారం హోటల్ నుంచి మైదానానికి, గ్రౌండ్ నుంచి మళ్లీ హోటల్‌కే వెళ్లాల్సి ఉంటుందన్నాడు. ఇది ఐపిఎల్ వంటి సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఏ క్రికెటర్‌కైనా చాలా ఇబ్బందికర విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదని గంగూలీ పేర్కొన్నాడు.
Indians more tolerant than overseas players:Ganguly