Wednesday, January 22, 2025

ఇకపై భారతీయుల సౌదీ వీసాలకు పోలీస్ క్లియరెన్స్ అవసరంలేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సౌదీ వీసాకు దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇక పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు. భారత్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. “భారత్‌తో సౌదీ అరేబియాకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం, బలమైన సంబంధాలు ఉన్న దృష్టా” ఇకపై భారతీయులకు పోలీస్ క్లియరెన్స్ అవసరంలేదని పేర్కొంది. దీంతో సౌదీకి వెళ్లే భారతీయుల వీసాలు వేగవంతంగా ప్రాసెస్ కానున్నాయి. పర్యాటక సంస్థలకు(టూరిజం ఫర్మ్స్) పని సులభతరం అవుతుంది. తక్కువ దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. తమ దేశంలో ఉన్న 20 లక్షల మంది భారతీయులు తమ దేశానికి ఎంతో సేవలందించారని కూడా సౌదీ అరేబియా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News