Monday, December 23, 2024

48 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు

- Advertisement -
- Advertisement -

Indians opened 48 lakh new demat accounts

ట్రేడింగ్ యాప్‌లతో సులభతరమైన స్టాక్స్ కొనుగోలు
పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు : సిడిఎస్‌ఎల్

న్యూఢిల్లీ : స్టాక్‌మార్కెట్ పట్ల దేశ ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా మార్కెట్లో పాల్గొంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 48 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. దీని ఆధారంగా స్టాక్‌మార్కెట్లో రిటైలర్లు పెరుగుతున్నారని తెలుస్తోంది. ఆసియాలోనే మొదటి లిస్టెడ్ డిపాజిటరీ సిడిఎస్‌ఎల్ ఈ సమాచారాన్ని అందించింది. 2022 ఆగస్టులో 7 కోట్ల డీమ్యాట్ ఖాతాలను నమోదు చేసిన మొదటి డిపాజిటరీ సంస్థగా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సిడిఎస్‌ఎల్) అవతరించింది. గత వార ం సెంట్రల్ డిపాజిటరీ 2022 సెప్టెంబర్ 30తో ముగిసిన అర్ధ సంవత్సరానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో సిడిఎస్‌ఎల్ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.316 కోట్లకు చేరుకుంది. కాగా నికర లాభం 8 శాతం క్షీణించి రూ.138 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సిడిఎస్‌ఎల్ మొత్తం ఆదాయం గతేడాదితో పోలిస్తే 3 శాతం పెరిగి రూ.170 కోట్లకు చేరుకుంది. కాగా నికర లాభం 7 శాతం తగ్గి రూ.80 కోట్లకు చేరుకుంది. సిడిఎస్‌ఎల్ ఎండి, సిఇఒ నేహాల్ వోరా మాట్లాడుతూ, దీపావళి వేడుకల మొదటి రోజు ధన్‌తేరస్ శుభ సందర్భంగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించినందుకు సంతోషిస్తున్నామన్నారు.

సిడిఎస్‌ఎల్ ఏమి చేస్తుంది?
సిడిఎస్‌ఎల్ అనేది దేశంలోని ఒక డిపాజిటరీ సంస్థ, ఇది పెట్టుబడిదారుల షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలను పేపర్‌కు బదులుగా ఎలక్ట్రానిక్ రూపంలో నిల్వ చేస్తుంది. ఈ డిపాజిటరీ బాం బే స్టాక్ ఎక్స్ఛేంజ్ ( బిఎస్‌ఇ) కోసం పనిచేస్తోంది. ఇది భారతదేశంలో రెండో డిపాజిటరీ సంస్థ, దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈ డిపాజిటరీని షేర్ల బ్యాంక్ అని కూడా పిలుస్తారు.

డీమ్యాట్ ఖాతాను ఎలా తెరవాలి?
రెండు డిపాజిటరీలతో వినియోగదారులు తమ ఖాతాలను తెరవవచ్చు. అవే ఎన్‌ఎస్‌డిఎల్, సిడిఎస్‌ఎల్, వీటి ద్వారా డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీరు బ్రోకరేజ్ హౌస్‌తో ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. అయితే బ్రోకరేజ్ హౌస్‌తో ట్రేడింగ్ ఖాతాను తెరిస్తే, ఆ బ్రోకర్ డీమ్యాట్ పనిని చేస్తాడు. డీమ్యాట్ ఖాతాను తెరవడానికి పాన్, బ్యాంక్ ఖాతా, గుర్తింపు కార్డు, చిరునామా రుజువు వంటి పత్రాలు ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News