Wednesday, April 2, 2025

సూడాన్ లో చిక్కుకున్న భారతీయులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా అక్కడ నుంచి తరలించడానికి ప్రత్యామ్నామ మార్గాల కోసం భారత ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడి భారతీయులను అప్రమత్తం చేసింది. యుద్ధం బీకరంగా మారుతుండడంతో విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. ఖార్తోమ్ లోని విమానాశ్రయాన్ని మూసివేశారు. ఈ పరిస్థితుల్లో రోడ్డు మార్గాల ద్వారా తరలించడమే సురక్షితమని ప్రభుత్వం యోచిస్తోంది. సూడాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఆర్మీ, పారామిలటరీ గ్రూపు రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) బలగాల మధ్య ఏప్రిల్ 15 నుంచి పోరాటం భీకరంగా సాగుతోంది. తరలింపు కార్యక్రమాలు పర్యవేక్షించడానికి భారత దౌత్య సిబ్బంది అక్కడే ఉంటోంది.

రోడ్డు మార్గం లోనే దగ్గర లో గల సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఖార్తోమ్‌లో తాత్కాలికంగా రాయబార కార్యాలయ విధులను అమెరికా ఆపేసింది. తమ దౌత్యసిబ్బందిని స్వదేశానికి రప్పించింది. రాపిడ్ సెక్యూరిటీ బలగాలు కొంతవరకు తరలింపు ఆపరేషన్‌లో మాకు సహకరిస్తున్నారని, సోషల్ మీడియాలో కొన్ని వాదనలు రావడం మీరు చూసి ఉండవచ్చని, దౌత్యకార్యాలయ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. “తరలింపు ఆపరేషన్ సమయంలో వారు కొంతవరకు సహకరించి మా సభ్యులపై కాల్పులు జరపలేదు. అది వారి స్వప్రయోజనాల కోసమో మరెందుకో తెలియదు” అని పేర్కొన్నారు.

ప్రజలను తరలిస్తామని మొదట ప్రకటించగానే వివిధ దేశాలకు చెందిన 150 మంది ఒకరోజు ముందుగానే సౌదీ అరేబియాకు చేరారు. సౌదీలు కాకుండా భారత్‌తోసహా 12 దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో సౌదీ అరేబియా ఎయిర్‌లైన్‌కు చెందిన ముగ్గురు భారతీయులను సౌదీ అరేబియా విమానం ద్వారా తరలించింది. కానీ ఆ విమానంపై కూడా కాల్పులు జరిగాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News