Sunday, January 19, 2025

కొత్త సంవత్సరం కొత్త వేరియంట్.. బీ అలర్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఓ ప్రక్క నూతన సంవత్సరోత్సవానికి రంగం సిద్ధమవుతుంటే, మరో ప్రక్క కోవిడ్ వేర్వేరు వేరియంట్లు ఆనందోత్సవ వాతావరణాన్ని దెబ్బతీసేందుకు తయారయ్యాయి. ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ ఎక్స్‌బిబి-1.5 వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లో ఈ వేరియంట్ తొలికేసు నమోదయింది. కాగా ఒమిక్రాన్ బిక్యూ-1తో పోలిస్తే ఇది 120 రెట్లు వేగంగా వ్యాపిస్తుందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ‘సూపర్ వేరియంట్ ’గా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అన్ని రకాల వేరియంట్ల కన్నా వేగంగా మన వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందని వారంటున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 ఒమిక్రాన్ వేరియంట్లు వ్యాపించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో ఏయే వేరియంట్లు వ్యాపిస్తున్నది, వాటి లక్షణాలు ఏమిటి అన్నది మనం గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్లు ఇవి: ఎక్స్‌బిబి, రీకాంబినేషన్ ఆఫ్ బిఏ2.75 మరియు బిజె-1, బిఏ-2.75, బిక్యూ-1, బిఏ-2. ఇప్పటి వరకు చైనాలో సంక్రమణాలకు కారణమైన బిఎఫ్-7 ఇప్పుడు మన దేశంలో కూడా కాలుమోపిందని తెలిసింది. అధికారిక డేటా ప్రకారం ఇప్పుడు దేశంలో డామినేట్ చేస్తున్న వేరియంట్లు ఎక్స్‌బిబి, బిఏ-2.75.

ఎక్స్‌బిబి లక్షణాలు ముక్కు కారడం, గొంతు మంట, జ్వరం, తలనొప్పి. ఇదిలావుండగా గత 24 గంటల్లో భారత్‌లో 243 కొత్త కరోనా వైరస్ సంక్రమణాలు వ్యాపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డేటా శుక్రవారం అప్‌డేట్ చేసింది. కాగా యాక్టివ్ కేసులు 3609కి పెరిగాయి. దేశ క్యుమ్యూలేటివ్ ట్యాలీ 44678158కి చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News