Monday, December 23, 2024

భారత్‌లో తగ్గిన క్రియాశీలక కోవిడ్ కేసులు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో కొత్త కరోనా వైరస్ కేసులు 169 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా శుక్రవారం పేర్కొంది. ప్రస్తుతం క్రియాశీలక కేసులు 2555 వద్ద ఉంది. గత కొన్ని నెలల్లో గణనీయంగా తగ్గింది. గత నెల ఎక్స్‌బిబి.1.16 ఒమిక్రాన్ వేరియంట్ పెరిగింది. కాగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. డాక్టర్లు ఇప్పటికీ బూస్టర్ వ్యాక్సినేషన్ వేసుకోని వారు వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికీ మైక్రో లెవల్‌ల్లో… అంటే జిల్లా స్థాయిల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 220.67 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. గత 24 గంటల్లో 887 డోసులు ఇచ్చారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News