న్యూఢిల్లీ: కరోనా కేసులు రోజువారీ సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరణాలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలు చేయడంతోపాటు టీకా కొరతను అధిగమిస్తామని వారు వెల్లడించారు. ఎక్కువ మందికి టీకా అందేలా చూడడం వల్ల కరోనా మరణాల్లో ఇక నుంచి తగ్గుదల వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. భారత్‌లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల ఉత్పత్తిని మరింత పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజుకు 25 లక్షలకు పైగా డోసులు అందించాలని తయారీ సంస్థలకు లక్ష్యం విధించారు. జూన్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చి టీకా ప్రక్రియను మరింత వేగవంతంగా, ముమ్మరంగా చేయాలని నిర్ణయించారు. రోజురోజుకూ టీకా తీసుకునే వారి సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని నిపుణులు తెలిపారు.
India’s Covid deaths to go down from June