లక్నో: దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన మహిళల మూడో వన్డేలో భారత్‌కు ఓటమి ఎదురైంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో సౌతాఫ్రికా ఆరు పరుగుల తేడాతో మిథాలీ సేనపై విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చేరు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా సిరీస్‌లో ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ మరోసారి (౦) నిరాశ పరిచింది. అయితే పూనమ్ రౌత్, మరో ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ధాటిగా ఆడిన మంధాన 4 ఫోర్లతో 25 పరుగులు చేసింది.
పూనమ్ రౌత్ 11ఫోర్లతో 77 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించడంలో ముఖ్య భూమిక పోషించింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ రాజ్‌ఐదుఫోర్లతో 36 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (36), దీప్తి శర్మ36(నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాను ఓపెనర్ లిజెల్ లీ అజేయ శతకంతో ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లిజ్‌ల్ లీ 131 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్సలతో అజేయంగా 132 పరుగులు చేసింది. ఆమెకు మిగ్నాన్ డు ప్రీజ్ (37) అండగా నిలిచింది. కాగా సౌతాఫ్రికా స్కోరు 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం మొదలైంది. వర్షం తగ్గక పోవడంతో డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం సౌతాఫ్రికాను విజేతగా ప్రకటించారు.