Monday, December 23, 2024

నగదు బదిలీ పథకం ఓ సాంకేతిక అద్భుతం..

- Advertisement -
- Advertisement -

India's deployment of Cash transfer is logistical marvel: IMF

నగదు బదిలీ పథకం ఓ సాంకేతిక అద్భుతం
సాంకేతికతను గొప్పగా ఉపయోగించుకోవడంలో ఆదర్శంగా నిలిచిన భారత్
అతంర్జాతీయ ద్రవ్యనిధి ప్రశంస
వాషింగ్టన్: భారత్ అమలు చేస్తున్న నేరుగా నగదు బదిలీ పథకం, ఇతర సామాజిక సంక్షేమ పథకాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ‘లాజిస్టికల్ అద్భుతాలు’గా అభివర్ణించింది. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని ఐఎంఎఫ్ అంటూ, ఈ విషయంలో భారత్‌ నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అభిప్రాయపడింది. వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సబ్సిడీలను సమర్థవంతంగా, పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లోకి సకాలంలో బదిలీ చేయడంతో పాటుగా మధ్య దళారీల పాత్రను పూర్తిగా తొలగించడం ఈ నేరుగా నగదు బదిలీ(డిబిటి) పథకం ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2013 నుంచి ఈ పథకాన్ని ఉపయోగించి రూ.24.8 లక్షల కోట్లను బదిలీ చేయడం జరిగింది. ఒక్క 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే రూ.6.3లక్షల కోట్లను బదిలీ చేయడం జరిగింది. అంటే సగటున రోజుకు 90లక్షలకు పైగా నేరుగా నగదు బదిలీ చెల్లింపులు జరిగాయని ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ‘భారత్‌ నుంచి నేర్చుకోవలసింది బోలెడుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఉదాహరణల నుంచి కూడా నేర్చుకోవలసింది బోలెడుంది. ప్రతి ఖండం నుంచి ప్రతి ఆదాయ స్థాయి నుంచి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

భారత్ విషయానికి వస్తే ఇది నిజంగానే చాలా అద్భుతం’ అని ఐఎంఎఫ్‌లో ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ పావోలో మౌరో బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ.. అన్నారు. భారత్‌లాంటి సువిశాలమైన దేశంలో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కోట్లాది మంది లబ్ధిదారులకు ఈ పథకాల లబ్ధి నేరుగా అందజేయడం నిజంగా ఓ అద్భుతమేనని భారత ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ముఖ్యంగా మహిళలు, వయోవృద్ధులు, రైతులు ఇలాఅన్ని వర్గాలకు చెందిన కార్యక్రమాలు దీనిలో ఉన్నాయని, ఈ ఉదాహరణల్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బోలెడంత సాంకేతిక ఆవిష్కరణ ఉందని ఆయన అన్నారు. భారత్ విషయంలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రత్యేక గుర్తింపు విధానం ‘ఆధార్’ను అద్భుతంగా ఉపయోగించుకోవడం అని మౌరో చెప్పారు. నూతన సాంకేతిక విధానాలను అమలు చేసే విషయంలో ఐఎంఎఫ్ భారత్‌తో కలిసి పని చేస్తోందని ఆర్థిక వ్యవహారాల విభాగం డైరెక్టర్ విటార్ గాస్పర్ అంటూ లక్షిత వర్గాలకు చెందిన సంక్లిష్ట సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించడంలో భారత్ ఒక గొప్ప ఉదాహరణ అనిఅన్నారు.

India’s deployment of Cash transfer is logistical marvel: IMF

India’s deployment of Cash transfer is logistical marvel: IMF

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News