Saturday, January 11, 2025

భారత్‌లో డాక్టర్‌ జనాభా నిష్పత్తి 1ః 834

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో డాక్టర్‌జనాభా నిష్పత్తి 1ః 834 వరకు ఉందని, రిజిస్టర్ అయిన అలోపతి డాక్టర్లు 80 శాతం వరకు అందుబాటులో ఉన్నారని, అలాగే 5.65లక్షల ఆయుష్ డాక్టర్లు ఉన్నట్టు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో మొత్తం 36.14 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారని, ఈ మేరకు నర్సులు జనాభా నిష్పత్తి 1ః476 గా ఉందని ఆమె వివరించారు.

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) వివరాల ప్రకారం 13,08,009 మంది అలోపతి డాక్టర్లు 2022 జూన్ నాటికి రాష్ట్ర, జాతీయ మెడికల్ కౌన్సిల్స్‌లో నమోదు చేసుకున్నారని, మంత్రి లిఖిత పూర్వకంగా వివరించారు. ప్రభుత్వం దేశం మొత్తం మీద మెడికల్ కాలేజీల్లో 82 శాతం వరకు పెంచిందన్నారు. 2014కు ముందు కేవలం 387 మెడికల్ కాలేజీలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 706 కు పెరిగిందన్నారు. ఎంబిబిఎస్ సీట్లు 2014కు ముందు 51348 ఉండగా, ఇప్పుడు 1,08,340 వరకు 112 శాతం పెరిగాయని వివరించారు. అలాగే పీజీ సీట్లు 31,185 నుంచి 70,674 వరకు అంటే 112 శాతం పెరిగాయని లిఖిత పూర్వకంగా తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News