భారత్ సంస్థ ఎవరెస్టు ఆర్గానిక్స్ వెల్లడి
బెంగళూరు : కొవిడ్ 19 చికిత్సకు వినియోగించే మొల్ను పిరవిర్ ఔషధానికి క్రియాశీల ఔషధ పదార్దాన్ని (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ ఎపిఐ)ను తాము తయారు చేస్తున్నట్టు భారత్‌కు చెందిన ఎవరెస్ట్ ఆర్గానిక్ సంస్థ మంగళవారం వెల్లడించింది. మెర్క్ కంపెనీ తాలూకు జనరిక్ వెర్షన్ అయిన ఔషధం మొల్ను పిరవిర్ కోసం ఈ తయారీని ప్రారంభించామని వివరించింది. ఈ వార్త బయటకు రావడంతో ఎవరెస్టు ఆర్గానిక్స్ షేర్లు 11.6 శాతం పెరిగాయి. మెర్క్ ప్రయోగాత్మక ఓరల్ డ్రగ్ కు ఎపిఐ తయారీ కోసం ఎవరెస్టు ఆర్గానిక్ డివి లేబొరేటరీతో భాగస్వామ్యం అయింది.
ఒసెల్టమివిర్, రెమ్‌డెసివిర్, వంటి అనేక రకాల కొవిడ్ డ్రగ్స్ తయారీ, మార్కెట్‌ల్లో విజయవంతమైన తరువాత ఎవరెస్టు ఆర్గానిక్స్ తన కార్యకలాపాలను విస్తరించిందని సిఇఒ శ్రీ కాకరపూడి శిరీష ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం మెర్క్ ఒక ప్రకటన చేస్తూ అమెరికాలో మొల్ను పిరవిర్ అత్యవసర వినియోగానికి అనుమతిని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పింది. నోటి ద్వారా అందించే మొదటి కొవిడ్ ఔషధంగా మొల్నున్ పిరవిర్ రికార్డుకెక్కాలన్నదే తమ లక్షంగా పేర్కొంది. ఈమేరకు అమెరికా నియంత్రణ సంస్థకు డేటా ఈనెల మొదట్లో అందింది. కొవిడ్ వల్ల ఆస్పత్రిలో చేరే పరిస్థితి సగానికి సగం ఈ మొల్ను పిరవిర్ తగ్గిస్తుందని, అలాగే ఆస్పత్రిలో చేరని రోగులకు మరణం సమీపించకుండా చేస్తుందని డేటా వెల్లడించింది