Friday, November 15, 2024

సిఎఎతో భారత ఉనికి ప్రమాదంలో…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంతో వివాదాస్పదమైన సిఎఎ చట్టాన్ని భారత ప్రభుత్వం మళ్లీ తీసుకు రావడం అనేది ప్రపంచ దేశాల్లో భారత దేశానికి ఉన్న విలువను, ఔన్నత్యాన్ని తగ్గిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపి, ఆల్ ఇండియా తంజీ మే ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ అజీజ్ పాషా, ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండి ఫయాజ్, రాష్ట్ర అధ్యక్షులు మునీర్ పటేళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. సిఎఎ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం లోని లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిరసన కార్య క్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అజీజ్ పాషా, ఎస్‌ఎండి ఫయాజ్, మునీర్ పటేల్‌లు మాట్లాడుతూ ఇది కేవలం ఒక ముస్లిం మైనార్టీలకు సంబంధించిన అంశమే కాదని, ఇది భారతదేశానికి సంబంధించిన విషయమని, ఇందులో దేశాన్ని ప్రేమించే ప్రతి పౌరుడు స్పందించి ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ ఫ్యూడల్ భావజాల విధానాన్ని తిప్పి కొట్టాలని  పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ రాష్ట్ర నాయకులు సంషుద్దీన్, హైకోర్టు అడ్వకేట్ అఫ్జల్ ఖాసిం, ఉల్మా షకీర్ తైమస్, నదీమ్, ఎండి యూసుఫ్, ఎండి రుక్మత్, పెద్ద సంఖ్యలో మహిళలు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News