Monday, January 20, 2025

భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్‌ డబ్ల్యు నూతన ప్రచారం

- Advertisement -
- Advertisement -

India's Fashion Brand W launches new campaign

న్యూఢిల్లీ: భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్‌– డబ్ల్యు ఇప్పుడు ఓ భారీ ప్రచారాన్ని ‘బీ ద సేమ్‌ ఆర్‌ బీ డబ్ల్యు (అలాగే ఉండండి లేదా డబ్ల్యుగా ఉండండి )’ పేరిట ప్రారంభించింది. తద్వారా ఈ పండుగ సీజన్‌ కోసం తమ తాజా కలెక్షన్‌ ప్రదర్శిస్తోంది. డబ్ల్యు యొక్క ఫ్యాషన్‌ ముందు అనే సిద్ధాంతానికి అనుగుణంగా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీర్చిదిద్దిన ఈ ప్రచారం, మహిళల కోసం పండుగ వస్త్ర బ్రాండ్‌గా డబ్ల్యును నిలుపనుంది. ఈ డిజిటల్‌ ఫస్ట్‌ ప్రచారం తల నుంచి పాదాల వరకూ వైవిధ్యమైన లుక్స్‌ను అందించడంతో పాటుగా ప్రతి సందర్భంలోనూ మహిళలను వైవిధ్యంగా నిలుపుతుంది. ఈ నూతన ప్రచారంతో, డబ్ల్యు మహిళలందరినీ చేరుకోవడంతో పాటుగా వారిని వైవిధ్యమైనది ఎంచుకోండి, వైవిధ్యంగా కనిపించండి మరియు వైవిథ్యంగా ఉండటాన్ని వేడుక చేసుకోండి అని కోరుతుంది.

డబ్ల్యు యొక్క ఆకర్షణీయమైన ఫెస్టివ్‌–2022 కలెక్షన్‌ వినూత్నమైన పండుగ ఫ్యూజన్‌ శైలిని సమకాలీన భారతీయ మహిళ కోసం అందిస్తుంది. దీనిలో సంప్రదాయ చీరకు ఆధునిక అవతారం ఇన్‌స్టా శారీ; పండుగ వేళ విభిన్నంగా కనిపించేలా లేయర్డ్‌ జాకెట్‌తో ఫ్యూజన్‌ డ్రెస్‌తో డ్యూయో డ్రెస్‌; ఆల్‌ ఇన్‌ ఒన్‌ ఎన్సెంబల్‌ కిమోనో జంప్‌సూట్‌ ఉన్నాయి. ఈ పండుగ కలెక్షన్‌ అత్యంత ఆకర్షణీయమైన బ్లూ, రెడ్‌, గ్రీన్‌,పింక్‌, ఎర్తీ టోన్స్‌తో వస్తాయి.

టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ కో లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనంత్‌ దాగా మాట్లాడుతూ.. ‘‘మా వినియోగదారుల అభిప్రాయాలను ఎప్పుడూ పరిగణలోకి తీసుకుంటుంటాము. ఈ వ్యూహం ఫ్యాషన్‌ పరంగా మేము ముందుండటానికి తోడ్పడటం మాత్రమే కాదు పరిశ్రమలో అత్యుత్తమ స్టైల్స్‌నూ రూపొందించడానికి తోడ్పడుతుంది. బీ ద సేమ్‌ ఆర్‌ బీ డబ్ల్యు ప్రచారం మా నిరంతర ఉత్పత్తి ఆవిష్కరణలక ప్రతీకగా నిలుస్తుంది’’ అని అన్నారు. ఈ కలెక్షన్‌ డబ్ల్యు ఔట్‌లెట్లు మరియు www.wforwoman. comవద్దలభ్యమవుతుంది.

India’s Fashion Brand W launches new campaign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News