Tuesday, December 24, 2024

ముంబైలో ఎక్స్‌ఇ… కప్పా

- Advertisement -
- Advertisement -

India’s first case of Covid variant XE found

కరోనా కొత్త వేరియంట్ల కలవరం

ముంబై : కొవిడ్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఇ తొలి కేసు ముంబైలో కనుగొన్నారు. దేశంలో ఓ వ్యక్తికి ఈ రకపు కరోనా వైరస్ సోకడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ముంబై స్థానిక అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఇక ఇక్కడ జరిపిన సీరో సర్వేలో ఓ వ్యక్తికి కప్పా వేరియంట్ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రెండు వైరస్‌లను జినోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియ దశలో గుర్తించారు. మొత్తం 376 శాంపుల్స్‌ను పరీక్షించారు. అత్యధికంగా 230 శాంపుల్స్‌లో 228 ఒమిక్రాన్ వేరియంట్లను గుర్తించారు. అంటే ముంబైలో ఇది దాదాపు 99.13 శాతంగా నిర్థారణ అయింది.

స్థానిక జినోమ్ సీక్వెన్సింగ్ లాబ్‌లో శాంపుల్స్ పరీక్షలు జరిగాయి. నూతన రకం వేరియంట్లు సోకిన వారిలో పరిస్థితి సీరియస్‌గా ఏమీ లేదు, వారు తగు విధంగా చికిత్సలు పొందుతున్నారు. ముంబైలో మంగళవారం మొత్తం 56 కొవిడ్ కేసులు రికార్డు అయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది పెరిగింది. బ్రిటన్‌లో తొలిసారి ఎక్స్‌ఇ వేరియంటును గుర్తించారు. ఇది ఒమిక్రాన్ కన్నా అత్యంత వేగంగా వ్యాపిస్తుందని, ఎక్కువగా నష్టానికి దారితీస్తుందని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వేరియంటు ఇప్పుడు కప్పా వేరియంట్లుతో పాటు వాణిజ్య రాజధాని, అధిక సమ్మర్థపు ముంబైలో ఉనికిలోకి రావడం అధికారులలో కలవరానికి దారితీసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News