Tuesday, January 7, 2025

ట్రయల్స్ ప్రారంభించనున్న భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు

- Advertisement -
- Advertisement -

లక్నో రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) అభివృద్ధి చేసిన భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు గురువారం లక్నోలోని ఆర్ డిఎస్ఓ  స్టేడియంలో ప్రారంభించిన ఆరవ ఇన్నోరైల్ ఎగ్జిబిషన్,కాన్ఫరెన్స్‌ లో అందరి దృష్టిని ఆకర్షించింది.

హర్యానాలోని జింద్,సోనిపట్ రైల్వే స్టేషన్‌ల మధ్య త్వరలో ట్రయల్ రన్ నడువనున్నది. దేశంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టడంతో భారతీయ రైల్వేలు ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోబోతున్నాయి.

రైలు ఫీచర్లు: 8 కోచ్‌లు, 2,638 ప్రయాణీకుల సామర్థ్యం

హైడ్రోజన్‌తో నడిచే రైలుకు ఇంకా పేరు పెట్టనప్పటికీ, ఆర్ డిఎస్ఓ రూపొందించిన మోడల్‌లో ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లు ఉన్నాయి, ఒకే ప్రయాణంలో 2,638 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది.

ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. మూడు కోచ్‌లు హైడ్రోజన్ సిలిండర్ల నిల్వ కోసం కేటాయించబడతాయి, ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ సెల్ కన్వర్టర్లు, బ్యాటరీలు , ఎయిర్ రిజర్వాయర్‌లను కలిగి ఉంటాయి.

ఈ మోడల్ స్వల్ప-దూర ప్రయాణం కోసం ఉద్దేశించబడింది, ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఇంటిగ్రేషన్ పని జరుగుతోంది.

హైడ్రోజన్-శక్తితో పనిచేసే ఇంధనం కేవలం నీటి ఆవిరిని ఉప ఉత్పత్తిగా ఉత్పత్తి చేస్తుంది, ఇది పూర్తిగా సున్నా-ఉద్గారంతో నడుస్తుంది . ఇది 2030 నాటికి నికర-సున్నా కర్బన ఉద్గారాలను సాధించాలనే భారతీయ రైల్వేల లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.

సాంప్రదాయ డీజిల్ లేదా బొగ్గుతో నడిచే రైళ్లతో పోలిస్తే ఈ రైలు మరింత శక్తిమంతంగా సమర్థవంతంగా, గణనీయంగా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఇది శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

దాదాపు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో, హైడ్రోజన్ రైళ్లు దీర్ఘకాలంలో ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయని అంచనా. ఉత్పత్తి స్థాయిలు పెరగడం ,ఇంధన ధరలు తగ్గడం వలన, నిర్వహణ ఖర్చులు మరింత తగ్గుతాయి, హైడ్రోజన్ ఇంధనం స్థిరమైన మరియు సరసమైన ఎంపికగా మారుతుంది.

హైడ్రోజన్ ఇంధనం రైలు రవాణా విషయంలో జర్మనీ, చైనా విజయం సాధించాయి. ప్రస్తుతం రెండు-కోచ్ మోడళ్లను నడుపుతున్న ఏకైక హైడ్రోజన్ రైళ్లను కలిగి ఉన్న దేశం జర్మనీ.

ఫ్రాన్స్ 2025 నాటికి కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళికలతో… అనేక ప్రాంతీయ మార్గాలలో హైడ్రోజన్ రైళ్లను నడపాలని ఆర్డర్ చేసింది. ఈ చొరవతో దేశవ్యాప్తంగా స్థిరమైన రవాణా ఎంపికలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వీడన్ గ్రీన్ ట్రాన్స్‌పోర్టేషన్ సొల్యూషన్స్ పట్ల నిబద్ధతలో భాగంగా హైడ్రోజన్‌తో నడిచే రైళ్లను రూపొందించాలనుకుంటోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News