Wednesday, January 22, 2025

జడ్డూ మాయాజాలం

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : బోర్డర్‌గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులకే చాపచుట్టేసింది. భారత స్పిన్ ఉచ్చులో చిక్కుకొని కేవలం 24 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టానికి 77 పరుగలు చేసింది. తొలి రోజు ఆట ముగింపునకు ఆరు బంతులు మిగిలుండాగా ఓపెనర్ కెఎల్ రాహుల్(20) మార్పీ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఓపెన్ రోహిత్ శర్మ (56)తో కలిసి నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన అశ్విన్ క్రీజులో కొనసాగుతున్నాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ రెండేళ్ల అనంతరం హాఫ్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.

చెలరేగిన జడేజా..

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. తొలుత భారత పేసర్ వికెట్ల పతనాన్ని షురూ చేయంగా దానిని స్పిన్నర్లు జడేజా, అశ్విర్ కొనసాగించారు. మహ్మద్ షమీ, మహసిరాజ్లు ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్(1), ఉస్మాన్ ఖవాజా(1)లను సింగిల్ డిజిట్‌కే పరిమితం చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్, స్మిత్ ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో ఆసీస్ 76/2తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. లంచ్ బ్రేక్ అనంతరం క్రీజులో పాతుకు పోయిన స్మిత్, లబుషేన్ జోడీని జడేజా విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన లబుషేన్(49)ను కేఎస్ భరత్ సాయంతో స్టంపౌట్ చేసిన జడేజా.. మరుసటి బంతికి మ్యాట్ రేన్‌షా(0)ను వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. ఆ కొద్ది సేపటికే స్టన్నింగ్ డెలివరీతో డేంజరస్ స్మిత్(37)ను క్లీన్ బౌల్ చేశాడు. ఇదే క్రమంలో పీటర్ హ్యాండ్స్‌కోంబ్(31), అలెక్స్ క్యారీ(36) భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి 53 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడి అశ్విన్ విడదీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మరో 15 పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లను ఆసీస్ కోల్పోడంతో 177 పరుగుల వద్ద ఇన్నింగ్స్ పుల్‌స్టాప్ పడింది.

అశ్విన్ అరుదైన రికార్డు..

తొలి ఇన్నింగ్‌లో అలెక్స్ క్యారీ(36)ను అశ్విన్ అవుట్ చేయడం ద్వారా 450 వికెట్లు తన ఖాతాలో విసుకున్నాడు. దీంతో అత్యంత వేగంగా 450 వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్తానంలో నిలిచాడు. కాగా, అశ్విన్ ఈ మార్క్‌ను చేరుకోవాడానికి కేవలం 89 టెస్టులే ఆడాడు. అశ్విన్ కన్నా ముందు లెజెండరీ ఆటగాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(80) ఉన్నాడు. ఇక భారత్ తరఫున కుంబ్లే(93) పేరిట ఉన్న ఈరికార్డును అశివన్ అధిగమించాడు. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో అశ్విన్ 3/42తో రాణించాడు.

India's first innings was 77 runs for the loss of a wicket

భారత్ జట్టులో తెలుగోడు..

ఈ టెస్టులో వికెట్ కీపర్‌గా బరిలోకి దిగిన కుర్రోడు మన తెలుగోడే. విశాఖపట్నంకు చెందిన శ్రీకర్ భరత్ భారత తుతి జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ద్వారా కెరీర్ ప్రారంభిచిన శ్రీకర్ 78 మ్యాచ్‌లు ఆడి 4,283 పరగులు చేశాడు. అందులో 23 ఆర్థ సెంచరీలుండటం గమనార్హం. ఇక గోవాతో 2015లో జిరగిన రంజీ మ్యాచ్‌లో త్రిపుల్ సెంచరీ(308) చేసి మమఅనిపించాడు. అంతేకాదు త్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గానూ ఇతగాడు రికార్డు నెలకొల్పాడు. దీంతో సెలెక్టర్లు శ్రీకర్ భారత్‌ఎ జట్టుకు ఎంపిక చేశారు.

ఇక, 2015లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్-2021 సీజన్ మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి భరత్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో మొత్తం 191 పరుగులు సాధించిన భరత్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించి సత్తాను చాటాడు. 2021లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు భరత్‌ను బిసిసిఐ ఎంపిక చేసినా జట్టులో పంత్ రాణిస్తుండడంతో తుది జట్టులో భరత్‌కు చోటు దక్కలేదు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 3 సెంచరీలు 5 హాఫ్ సెంచరీలు, టి20 క్రికెట్‌లో మూడు హాఫ్ సెంచరీలు కొట్టిన శ్రీకర్ టీమిండియా తుది జట్టులో దక్కడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News