Friday, January 24, 2025

“ జెన్నోవా” ఫార్మా కొవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి

- Advertisement -
- Advertisement -

India's first mRNA vaccine by Gennova gets DCGI approval

న్యూఢిల్లీ : దేశీయ తొలి ఎంఆర్‌ఎన్‌ఎ జెమ్‌కోవాక్ 19 వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డిసిజిఐ ) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మాక్యూటికల్స్ కరోనా మహమ్మారికి దేశీయంగా టీకాను అభివృద్ది చేసింది. 18 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు వారికి ఈ టీకా ఇవ్వనున్నారు. రెండు డోసుల టీకాను 28 రోజుల వ్యవధిలో ఇంట్రామస్కులర్ విధానంలో వేయనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను జెమ్‌కో వాక్ 19 పేరుతో కంపెనీ విక్రయిస్తుంది. జెమ్‌కోవాక్ 19 భారత్‌లో అభివృద్ధి చేసిన మొదటి ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా నివారణకు ఆమోదించిన మూడో ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్. 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా ఈ వ్యాక్సిన్‌ను నిల్వ చేయొచ్చు. సాధారణంగా ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్లను సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు. నెలకు దాదాపు 50 లక్షల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్షంగా పెట్టుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News