Monday, January 20, 2025

దేశంలోనే తొలి సోడియం అయాన్ బ్యాటరీలు

- Advertisement -
- Advertisement -

విడుదల చేసిన సోడియన్ ఎనర్జీ
మన తెలంగాణ/ హైదరాబాద్ : సోడియం అయాన్ బ్యాటరీ డెవలపర్ అయిన సోడియన్ ఎనర్జీ తమ సొంత సాంకేతికతతో అభివృద్ధి చేసిన సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో విడుదల చేసింది. దీంతో పాటు వాటికి ఉపకరించే యుపిఎస్, స్టార్టర్ బ్యాటరీ, బ్యాటరీ ప్యాక్ వంటి సోడియం అయాన్ బ్యాటరీల ఉత్పత్తులను ప్రకటించింది. సోడియన్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు బాల పచియప్ప మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ లెడ్ యాసిడ్, లిథియం అయాన్ బ్యాటరీల కంటే సోడియం అయాన్ సాంకేతికతతో రూపకల్పన చేసిన ఈ బ్యాటరీలు ఎక్కువ శక్తి నిల్వలను కల్గివుంటాయని అన్నారు. 2026 నాటికి విద్యుత్ నిల్వల అవసరం ఐదు రెట్లు పెరుగుతుందని, ముఖ్యంగా అధిక జనాభా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో ఈ శక్తి నిల్వలు పవర్ స్టోరేజీకి దోహదపడే అవకాశముందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News