Tuesday, November 26, 2024

దేశంలోనే తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదల

- Advertisement -
- Advertisement -

India's first vaccine against cervical cancer

న్యూఢిల్లీ : దేశం లోనే తొలి గర్భాశయ క్యాన్సర్ (కెర్వికల్ క్యాన్సర్) వ్యాక్సిన్‌ను గురువారం విడుదల చేశారు. “90 శాతం గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాక్సిన్ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్‌పర్శన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇన్ ఇమ్యునైజేషన్ డాక్టర్ అరోరా చెప్పారు. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను తయారు చేసే బాధ్యతను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెలలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఢిల్లీ లోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్ రాకతో భారత దేశ వైద్యశాస్త్రంలో ఒక మైలురాయి సాధించినట్టయింది. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్‌ను గురువారం ప్రారంభించారు. 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News