ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం: మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: వచ్చే రెండు సంవత్సరాల పాటు భారతదేశం ఆర్థిక వృద్ధి రేటు అంచనాను అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తగ్గింది. ప్రపంచ మందగమనం, చమురు ధరల పెరుగుదల, బలహీన దేశీయ డిమాండ్ వంటి అంశాల కారణంగా భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో కోత విధించినట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202223) భారత్ జిడిపి అంచనా 7.6 శాతానికి, 202324 ఆర్థిక సంవత్సరానికి 6.7 శాతానికి తగ్గిస్తున్నట్టు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. రష్యాఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడంతో ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైందని, దీంతో భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరిందని సంస్థ తెలిపింది. మోర్గాన్ స్టాన్లీ చీఫ్ ఎకనమిస్ట్(ఇండియా) ఉపాసన చచ్రా మాట్లాడుతూ, గరిష్ఠానికి ద్రవ్యోల్బణం, బలహీన వినియోగ డిమాండ్, ఆర్థిక ఆంక్షలు కఠినతరం, వ్యాపార సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం, మూలధన వ్యయం రికవరీలో ఆలస్యం వంటి అంశాలు భారత్ జిడిపిని ప్రభావం చేశాయని అన్నారు.