- Advertisement -
2022-23కు రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా
ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2022-23) భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటును 7.8 శాతంగా రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ప్రభుత్వం మౌలికసదుపాయాల కోసం ఖర్చు చేయడం, ప్రైవేటు మూలధన వ్యయం పెంచడం వంటి నిర్ణయాల వల్ల జిడిపి 7.8 శాతం ఉంటుందని తెలిపింది. రష్యాఉక్రెయిన్ యుద్ధం ప్రభావం ఉండనుందని, దీని వల్ల వృద్ధి రేటు తగ్గే అవకాశముందని రేటింగ్ సంస్థ హెచ్చరించింది. ఇక అమెరికా బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా భారతదేశం జిడిపి వృద్ధి రేటులో కోత విధించింది. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధరలపై ప్రభావం ఉండడంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202223) గాను ఇండియా జిడిపిని 7.9 శాతానికి తగ్గించింది.
- Advertisement -