Tuesday, January 21, 2025

భారత్ జిడిపి 6.3 శాతమే..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి అంచనాను తగ్గించింది. ఆదాయం మందగించడం వల్ల వినియోగం తగ్గిందని, దీని కారణంగా భారతదేశ జిడిపి వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.6 శాతం నుండి 5.2 శాతానికి క్షీణించనుంది. గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కొంత మితంగా ఉన్నప్పటికీ భారతదేశ జిడిపి వృద్ధి అనువైనదిగా ఉంటుందని అంచనా. 2023-24లో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) కూడా 5.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ తన 2023-24 జిడిపి వృద్ధి అంచనాను 6.6 శాతం నుండి 6.3 శాతానికి సవరించింది. వినియోగ వృద్ధి మందగించడం, బాహ్య పరిస్థితుల కారణంగా జిడిపి వృద్ధి మితంగా ఉండనుంది. పెరుగుతున్న రుణ ఖర్చులు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి ప్రైవేట్ వినియోగ వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఆర్థికవేత్తల ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారతదేశ సేవల ఎగుమతుల వృద్ధి రికార్డు స్థాయికి చేరుకుంది.

కరెంట్ ఖాతా లోటును ఊహించిన దాని కంటే ఎక్కువ 18.2 బిలియన్ డాలర్లకు లేదా జిడిపిలో 2.2 శాతానికి తగ్గించింది. సేవల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సునీల్ తలతి మాట్లాడుతూ, 2024 మార్చి నాటికి సేవల ఎగుమతులు 375 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని భావిస్తున్నామని అన్నారు. 2023లో ఇది 320-350 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో ప్రభుత్వ లోటు 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేసిన సునీల్ మాట్లాడుతూ, 2025 మార్చి నాటికి సేవల ఎగుమతులు వస్తువుల ఎగుమతులను అధిగమిస్తాయని అన్నారు. ఆర్‌బిఐ తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సరుకుల ఎగుమతులు 105.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధి అక్టోబర్‌డిసెంబర్ త్రైమాసికంలో 4.4 శాతానికి తగ్గింది. ఇది ఏడాది క్రితం 11.2 శాతంగా ఉంది.అక్టోబరు-డిసెంబర్ త్రైమాసికంలో భారత్ సేవల ఎగుమతి వృద్ధి అత్యధిక స్థాయికి చేరుకుందని నివేదిక పేర్కొంది. దీని కారణంగా గ్లోబల్ రిస్క్ ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందని అంచనా వేశారు.

జిడిపిని 6.4 శాతానికి తగ్గించిన ఎడిబి

ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎడిబి) కూడా భారత్ జిడిపి అంచనాను తగ్గించింది. గతంలో అంచనా వేసిన 7.2 శాతాన్ని ఇప్పుడు 6.4 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎడిబి పేర్కొంది. ప్రపంచ, దేశీయ పరిస్థితుల నుంచి ముప్పు వల్ల జిడిపిని తగ్గించినట్టు ఎడిబి వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు క్షీణించకపోతే భారత్ జిడిపిని పెంచుతాయని, అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ వృద్ధి క్షీణించనుంది. ఇది భారత్‌పై ప్రభావం చూపనుందని ఎడిబి అవుట్‌లుక్‌లో వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News