Monday, December 23, 2024

భారత్ జిడిపి 6.3 శాతానికి తగ్గింపు.. వర్షాలు లేకపోవడంతో

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2023-24) గాను భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు ను ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) తగ్గింది. జిడిపిని 0.10 బేసి స్ పాయింట్లు తగ్గించి 6.3 శాతంగా అంచనా వేసింది. ఈసారి రుతుపవనాలను ఆశించినంతగా లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే దీనికి విరుద్ధంగా ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ 202324కు జిడిపి అంచనాను 30 బేసిస్ పా యింట్లు పెంచి 6.2 శాతానికి పెంచింది.

ఎడిబి అంచనా ప్రకారం, ఎగుమతులు క్షీణించడం, వర్షాలు తగినంతగా లేకపోవడంతో వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యాంక్ ఆర్థికవేత్తలు కూడా ఏప్రిల్‌కు ద్రవ్యోల్బణం అంచనాను 5 శాతం నుంచి 5.5 శాతానికి పెంచగా, 202425కు జి డిపి అంచనాను 6.7 శాతానికి తగ్గించారు. ఎడిబి సౌత్ ఆసియా రీజిన ల్ ఎకనమిక్ అడ్వైజర్ రానా హాసన్ మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్ర ప్ర భుత్వం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. కానీ ప్రస్తుత త్రైమాసిక గణాంకాలు రాష్ట్రా మెరుగ్గా ఉన్నాయని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News