Monday, December 23, 2024

భారత జిడిపి 6.2శాతం వృద్ధి

- Advertisement -
- Advertisement -

మోర్గాన్ స్టాన్లీ నివేదిక

న్యూయార్క్ : భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి జిడిపి వృద్ధి, ఆర్‌బిఐ వడ్డీరేట్లపై ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కావడం, వినియోగ పునరుద్ధరణ, పెరిగిన ప్రైవేట్ సెక్టార్ క్యాపెక్స్, ప్రభుత్వవ్యయంలో పెరుగుదల ఫలితంగా 24లో భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 6.2శాతం వృద్ధి చెందుతుందని పేర్కొంది.

ద్రవ్యోల్బణ అంచనాలు మెరుగైనందున ఆర్‌బిఐ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రారంభమవతుందని మోర్గాన్ స్టాన్లీ నివేదికలో పేర్కొంది. 2024లో రెండో త్రైమాసికం నాటికి దేశంలో ద్రవ్యోల్బణం 5శాతం కంటే తక్కువగా ఉండవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఏప్రిల్‌లో 4.7శాతం ఉండగా జూన్‌తో ముగిసే త్రైమాసికంలో 5శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News