Thursday, January 23, 2025

భారత్ భళా

- Advertisement -
- Advertisement -

ఆర్థికప్రగతిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని ఐఎంఎఫ్ ప్రశంస

ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 16శాతం వాటా ఇండియాదే

ఆర్థిక విధానాలు, ద్రవ్య విధానాలు భేష్
డిజిటలైజేషన్, ఇన్‌ఫ్రా రంగాల్లో సంస్కరణలతో వేగంగా వృద్ధి

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఫ్) భారతదేశాన్ని ‘స్టార్ పెర్ఫార్మర్’గా ప్రకటించింది. డిజిటలైజేషన్, మౌలిస సదుపాయాలు వంటి కీలక రంగాల్లో ఆర్థిక సంస్కరణలతో భారత్ వేగంగా వృద్ధిని సాధిస్తోంది. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి రేటుకు భారతదేశం 16 శాతానికి పైగా సహకారం అందించగలదని ఐఎంఎఫ్ పేర్కొంది. ఐఎంఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ నాదా చౌయిరీ మాట్లాడుతూ, భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ విషయాన్ని గత కొంత కాలంగా గమిస్తున్నామని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే వాస్తవ వృద్ధికి వచ్చినప్పుడు భారత్ స్టార్ పెర్ఫార్మర్‌లలో ఒకటిగా కనిపిస్తుంది. భారత్‌లో కార్మిక శక్తి అపారంగా ఉందని, దేశం సామర్థంలో దీనిని వినియోగించుకోవడం లేదు. విద్య, నైపుణ్యం, మహిళ ఉద్యోగుల సంఖ్య పెంపు వంటి చర్యలతో భారత్ గరిష్ఠ స్థాయిలో సామర్థాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని ఐఎంఎఫ్ సూచించింది.
ప్రపంచ మందగమనాన్ని ఎదుర్కొంటోంది..
భారతదేశంతో వార్షిక ఆర్టికల్-4 సంప్రదింపుల ప్రకారం, దక్షిణ ఆసియా ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. అదే సమయంలో గ్లోబల్ వృద్ధి మందగమనం కారణంగా భారత్‌కు ఎదురుగాలులు వీస్తున్నాయని నాదా చౌయిరీ అన్నారు.
కరోనా నుంచి పటిష్టంగా..
కరోనా మహమ్మారి నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ముందుకు సాగుతూ, వేగంగా కోలుకుందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. 2022-23లో ద్రవ్యోల్బణం తగ్గగా, బడ్జెట్ లోటు కూడా దిగొచ్చింది. అయితే ప్రజా రుణం ఎక్కువగానే ఉంది. పెట్టుబడి, అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం ముఖ్యమని చౌయిరీ అన్నారు.
వ్యాపార వృద్ధికి అనేక చర్యలు
వ్యాపార వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది, అయితే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలా అధికార యంత్రాంగం, నిబంధనలు ఇతరత్రా వాటితో ఆలస్యం సమస్యలు ఉన్నాయి. అయితే సమగ్ర సంస్కరణలు చేస్తే, అదనపు శ్రమ, మానవ మూలధన సహాయంతో అధిక వృద్ధిని సాధించగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది.
భారత్ జిడిపి అంచనా 6.3%
రెండు నెలల క్రితం అక్టోబర్ 10న ఐఎంఎఫ్ 2024 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి వృద్ధి రేటు అంచనాను 6.3 శాతానికి పెంచింది. 2023 అక్టోబర్ నాటి వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ (డబ్లుఇఒ) నివేదికలో ఐఎంఎఫ్ ఈ సమాచారాన్ని అందించింది. అంతకుముందు జూన్‌లో కూడా భారతదేశ జిడిపి వృద్ధి రేటు అంచనా 6.1 శాతానికి పెంచింది. ఐఎంఎఫ్ 202425 కోసం భారతదేశ జిడిపి వృద్ధి రేటు అంచనాను 6.3 శాతమే పేర్కొంది. భారత్ వృద్ధి బలంగానే ఉంటుందని ఐఎంఎఫ్ నివేదికలో పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News